లక్కీ హీరోయిన్‌తో ప్రభాస్ రొమాన్స్.. ఆ సెంటిమెంట్ ప్రకారం ఇది కూడా హిట్టే!

టాలీవుడ్‌లో ఇప్పుడున్న స్టార్ హీరోలు అందరూ భారీ భారీ సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్లుగా సత్తా చాటుతున్నారు. అందులో అందరి కంటే ముందు వరుసలో ఉన్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. సుదీర్ఘ కాలంగా హై రేంజ్ మూవీలతో ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తోన్న అతడు.. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

ఇటీవలే రెబెల్ స్టార్ ప్రభాస్ 'సలార్: సీజ్‌ఫైర్' మూవీతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ జోష్‌లోనే ఉప్పుడు అతడు 'కల్కి ఏడి 2898' సినిమాలో నటిస్తున్నాడు. ఇది మరికొద్ది రోజుల్లోనే విడుదల కాబోతుంది. అలాగే, దీని తర్వాత ప్రభాస్ 'ది రాజా సాబ్', 'సలార్ 2', 'స్పిరిట్' మూవీలను చేయబోతున్నాడు. ఇవి కాకుండా అతడు మరో మూవీని లైన్‌లో పెట్టాడు.

Mrunal Thakur Fix for Prabhas and Hanu Raghavapudi Movie

రెబెల్ స్టార్ ప్రభాస్.. 'సీతా రామం' దర్శకుడు హను రాఘవపూడితో కూడా ఓ మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ వరల్డ్ వార్ నేపథ్యంతో సాగే ఓ ప్రేమ కథతో తెరకెక్కనుందని ఇప్పటికే న్యూస్ బయటకు వచ్చింది. దీంతో అధికారికంగా ప్రకటించక ముందే ఈ ప్రాజెక్టుపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. అదే సమయంలో అంచనాలు కూడా భారీగా ఏర్పడుతున్నాయి.

ప్రభాస్ - హను చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే రాబోతుందని తెలిసింది. అంతేకాదు, ఆ వెంటనే పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని, ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ను 2024 డిసెంబర్ నెల నుంచి మొదలు పెట్టేలా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఈ గ్యాప్‌లో ఇందులో నటించే నటీనటులను వాళ్లను ఫైనల్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.

Mrunal Thakur Fix for Prabhas and Hanu Raghavapudi Movie

ప్యూర్ లవ్ స్టోరీతో రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరిని తీసుకుంటారన్న దానిపై కూడా ఓ రేంజ్‌లో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీలీల సహా ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ప్రభాస్ సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తుందట. ఇప్పటికే హను ఆమెకు స్టోరీ చెప్పగా.. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని టాక్.

ఇప్పటికే మృణాల్ ఠాకూర్ తెలుగులో చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఆ సెంటిమెంట్ ప్రకారం ప్రభాస్ మూవీ కూడా సక్సెస్ అవుతుందని అతడి ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మించబోతున్నారు. దీన్ని కూడా పాన్ ఇండియా రేంజ్‌లోనే చాలా భాషల్లో రూపొందిస్తారని తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X