శృతి హాసన్ ఛాన్స్ కొట్టేసిన మృణాల్ .. ఆమె తప్పుకుందా? తప్పించారా?
దక్షిణాది చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ పరిస్థితి ఉంటే సూపర్ గా లేకపోతే డల్ గా ఉంటుంది అని చెప్పాలి. పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ కొంతమంది హీరోయిన్స్ సరైన అవకాశాలు లేక స్ట్రగుల్ అవుతుంటారు. ఇంకొందరు అయితే అందం చందం అన్నీ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు వాళ్ళకీ ఉండవు. ఇక వీరితో పాటుగా కొందరికి మంచి నటన ఉన్నప్పటికీ వాళ్ళు కూడా అంతగా సినిమాల్లో రాణించరు.
ఇలా మొత్తానికి హీరోయిన్స్ పరంగా పరిస్థితులు మన తెలుగు సినిమా దగ్గర అలాగే సౌత్ ఇండస్ట్రీ దగ్గర మారిపోతూ ఉంటాయి. కాగా కొందరి హీరోయిన్స్ విషయానికి వస్తే ఒకరు చేయాల్సిన పాత్రలు ఇంకొకరు చేయడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇలానే ప్రస్తుతం ఓ ఇద్దరు టాప్ హీరోయిన్స్‌కి సంబంధించి ఇంట్రెస్టింగ్ వార్తలు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంటాయి.

ఆ హీరోయిన్స్ ఎవరో కాదు శృతి హాసన్ అలాగే మృణాల్ ఠాకూర్ . శృతి హాసన్ తెలుగు సినీ పరిశ్రమలో దశాబ్దం క్రితమే పరిచయం అయ్యి మొదట్లో స్ట్రగుల్ అయ్యింది కానీ తర్వాత గబ్బర్ సింగ్ తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక అక్కడి నుంచి వరుస ఆఫర్స్‌ని అందుకున్న శృతి హాసన్ తెలుగు సహా తమిళ్ ఇంకా హిందీ సినిమాలలో కూడా బాగానే రాణించింది.
ఇప్పటికీ పలు భారీ సినిమాలు, ఆఫర్స్ చేతిలో ఉన్నాయి . కానీ వీటిలో ఓ తెలుగు సినిమాని స్టార్ట్ చేసి మరీ వదులుకుంది శృతి. ఆ చిత్రమే యువ హీరో అడివి శేష్ తో చేయాల్సి ఉన్న "డెకాయిట్" . ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసాక సినిమా షూటింగ్‌లో కూడా కొన్ని రోజులు పాల్గొంది. కానీ ఇపుడు ఈమె ప్లేస్‌లోకి సెన్సేషనల్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ లైన్ లోకి వచ్చింది.

శృతి హాసన్ వదులుకున్న ఆఫర్ ని మృణాల్ ఎలా ఒడిసిపట్టుకుందోనంటూ తెలుగు సినీ వర్గాల్లో పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. వీటితో శృతి హాసన్ కి ,చిత్ర యూనిట్ కి సినిమా షూటింగ్ సమయంలో సరిగ్గా పడకపోవడం మూలానే శృతి బయటకి వచ్చేసిందట. కొన్ని సీన్స్ విషయంలో మేకర్స్ కి శృతికి పొంతన సెట్ కాలేదట.
అందుకే శృతి హాసన్ బయటకి వచ్చేయగా ఇపుడు తన ప్లేస్ లోకి మృణాల్ ఠాకూర్ వచ్చింది. గత కొన్ని రోజులు నుంచి మృణాల్ తెలుగు సినిమా పట్ల ఆసక్తిగా ఉంది. సో ఎట్టకేలకి ఈ సినిమాలో ఈమె కనిపించనుంది అని చెప్పాలి. అంతకుముందు పాన్ ఇండియా హీరో ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ భారీ చిత్రం "స్పిరిట్"లోనూ మృణాల్ ఛాన్స్ కొట్టేసింది అని పలు రూమర్స్ వచ్చాయి కానీ అవి నిజం కాదు అని తెలిసింది.


Click it and Unblock the Notifications











