విజయ్ - మృణాల్ బంధం ఇప్పటిదీ కాదు.. అప్పుడే కలవాల్సింది కానీ.. రష్మిక ఎంట్రీతో..!
మృణాల్ ఠాకూర్.. ప్రస్తుతం ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. నార్త్ టు సౌత్ ఇండస్ట్రీ అంతా ఈమె పేరే జపిస్తోంది. ఈ ముద్దుగుమ్మ- సెన్సేషనల్ విజయ్ దేవరకొండతో కలిసి ఓ సినిమా చేస్తోంది. అయితే అంతా అనుకున్నట్టు జరిగితే ఎప్పుడో వీరిద్దరు ఒకటయ్యేవారట. ఏంటి అర్థం కాలేదా. సరే మ్యాటర్ లోకి వెళ్దాం..
చెరగని ముద్ర: మృణాల్ ఠాకూర్.. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సీతారామం' చిత్రంతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగు సినీ ప్రేక్షకుల గండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తన అందం, అభినయంతో నూర్జహాన్ పాత్రకు ప్రాణం పోసి.. అందరినీ మనసుల్ని కట్టి పడేసింది. సీతగా చెరగని ముద్ర వేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే సంప్రదాయ పద్ధతిలో చక్కనైన చీర కట్టులో.. ఆడియెన్స్ మనసులను దోచేసింది.

ఫుల్ డిమాండ్: ఇక 'సీతారామం' సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వడం వల్ల ఇప్పుడీ అందానికి ఇండస్ట్రీలో ఫుల్ డిమాండ్ పెరిగింది. స్టార్ హీరోల సినిమాలలోనూ ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వస్తున్నాయి. పాన్ ఇండియా హీరోల సరసన కూడా అవకాశాలను అందుకునే విధంగా ఈ అమ్మడు కెరీర్ ముందుకు సాగుతోంది. కానీ ఈ అమ్మడు ఆచితూచి కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే తెలుగులోనూ ఇద్దరు స్టార్ హీరోల సరసన రెండు మంచి అవకాశాలను అందుకుంది.

నాని అండ్ విజయ్ తో: తెలుగులో ఈ అమ్మడుకు నేచురల్ స్టార్ నాని, సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. నానితో 'హాయ్ నాన్న' కోసం దాదాపు రూ. 3కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందని వార్తలు వచ్చాయి. VD13 కోసం రూ.3.2కోట్లు తీసుకుందని ప్రచారం సాగింది. దీంతో అందరూ షాక్ కు గురయ్యారు. తెలుగులో మంచి ఫామ్ లో ఉండి చేతిలో పది సినిమాలు ఉన్న శ్రీలీలనే కోటి నుంచి కోటీ యాభై లక్షల వరకు డిమాండ్ చేసిందట. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం ఏకంగా అంత డిమాండ్ చేసేసరికి అందరూ షాక్ అవుతున్నారు.

అప్పుడే ఎంట్రీ ఇవ్వాల్సిందే: అయితే విజయ్ తో చేయబోయే సినిమా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. 'గీతా గోవిందం' చిత్రానికి సీక్వెల్ అని అంటున్నారు. అప్పట్లో రష్మిక విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన తొలి భాగం ఎంతటి సెన్సేషనల్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే వాస్తవానికి మృణాల్ 'సీతారామం' కన్నా ముందుగానే తెలుగులో ఈ చిత్రం ద్వారానే ఎంట్రీ ఇవ్వాల్సిందట. కానీ రష్మిక ఎంట్రీ అవ్వడం వల్ల ఆగిపోయిందట.

సీక్వెల్ తో ఆఫర్: 'గీతాగోవిందం' కోసం మొదట పరశురామ్ మృణాల్ ను అనుకున్నారట. కానీ ఆ సమయంలో ఆమెకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. రష్మికకు అప్పటికే 'ఛలో' సినిమాతో ఫుల్ క్రేజ్ ఉంది. దీంతో చేసేదేమి లేక రష్మికను తీసుకోవాల్సి వచ్చిందట. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచి రష్మికకు మరో గ్రాండ్ సక్సెస్ ను అందించింది. లేదంటే అప్పుడే మృణాల్ ఎంట్రీ ఇచ్చేది. అయినా అప్పుడు అవకాశం పోతేనే.. ఇప్పుడు సీక్వెల్ తో ఆఫర్ వరించిందని ప్రస్తుతం కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











