Mrunal Thakur గ్లామర్‌తో అదరగొట్టిన మృణాల్ థాకూర్.. హిరామండి షోలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా
తెలుగు సినిమా పరిశ్రమలో మృణాల్ థాకూర్ మంచి జోష్‌తో కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. సీతారామం సినిమా ఆమె జాతకాన్ని తిప్పి పడేసింది. ఆ సినిమా సక్సెస్ కావడంతో వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. దాంతో ఆమె బిజీగా మారిపోయింది. హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్ సినిమాలు ఆమె కెరీర్‌ను బూస్ట్ చేశాయి. తాజాగా ఈ అమ్మడు అఫైర్ గురించి వార్తలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ వార్త వివరాల్లోకి వెళితే..
నాకు గతంలో బాయ్‌ఫ్రెండ్ ఉండేవాడు. అతడితో రిలేషన్‌షిప్ కొనసాగింది. అతడిది చాలా సాంప్రదాయమైన కుటుంబం. అతడు పెరిగిన విధానం, నేను పెరిగిన పద్దతి వేరు. ఆ విషయంలో నాకు, ఆయనకు విభేదాలు వచ్చాయి. ఆ విషయంలో మా బంధాన్ని కొనసాగించలేకపోయాం. అలా నా అఫైర్‌కు బ్రేకప్ పండింది అంటూ మృణాల్ థాకూర్ చెప్పారు.

అయితే ఇటీవల కాలంలో సింగర్ బాద్షాతో అఫైర్ కొనసాగిస్తుందనే వార్త బాలీవుడ్ మీడియాలో వైరల్ అయింది. అయితే అయితే ఈ వార్తల తీవ్రత ఎక్కువ కావడంతో ర్యాపర్ బాద్షా మీడియాలో స్పందించారు. నాకు ఆమెకు ఎలాంటి రిలేషన్‌షిప్ లేదు. మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. మా స్నేహాన్ని కొనసాగిస్తున్నాం అని బాద్షా అన్నారు.
అయితే నాకు పెళ్లిపై మంచి అభిప్రాయం ఉంది. పెళ్లిళ్లు జరిగేవి స్వర్గంలోనే రాసి పెట్టి ఉంటాయి. ప్రతీ ఒక్కరి లైఫ్‌లో 18, 20, 30, 40 ఏళ్లలో తనకు సరిపోయే వ్యక్తులు తారసపడుతారు. అలాంటి సమయంలోనే మన జీవిత భాగస్వామిని ఎంచుకోవాలి. పెళ్లికి వయసుతో సంబంధం లేదు అని వేదాతం చెప్పింది.

తాజాగా బాలీవుడ్‌లో మరోసారి ఓ మిస్టరీ మ్యాన్‌తో మృణాల్ థాకూర్ కనిపించింది. గ్లామర్‌తో అందర్నీ ఆకర్షించింది. ఏప్రిల్ 24వ తేదీన జరిగిన హిరామండి ప్రీమియర్ సందర్భంగా ఓ వ్యక్తితో కలిసి సన్నిహితంగా కనిపించారు. అతడి చేతిని తన చేతిలో పెట్టుకొని మీడియా కెమెరాలకు ఫోజిచ్చారు. దాంతో ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? ఆమె కొత్త బాయ్‌ఫ్రెండా? అనే అనుమానాలు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం మృణాల్ థాకూర్‌తో ఉన్న వ్యక్తి గురించి ఆసక్తిగా ఆరా తీస్తున్నారు. అయితే ఆమెతో ఉన్నది గంగూభాయ్ కతియావాడిలో ఆలియా భట్‌తో నటించిన యాక్టర్ శంతను మహేశ్వరి అని తేలింది. ప్రస్తుతం మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతున్నది. నిజంగా ఆమె బాయ్ ఫ్రెండా? లేదా బాలీవుడ్‌లో ఫ్రెండా అనే విషయంపై పెద్దగా క్లారిటీ లేకపోయింది. ఆమెనే స్వయంగా వివరణ ఇస్తే క్లారిటీ వచ్చేస్తుంది.


Click it and Unblock the Notifications











