Mrunal Thakur: సీనియర్ హీరోతో మృణాల్ ఠాకూర్ రొమాన్స్!

తెలుగు సినిమాలో పరిచయం అయ్యిన ఒక్క సినిమా తోనే మంచి ఫేమ్ అండ్ మార్కెట్ అందుకోవడం అనేది చాలా మంది హీరోయిన్స్ కి సాధ్యం కాదని చెప్పాలి. కాగా కొందరు ఇండస్ట్రీలోకి వచ్చిన కొన్నేళ్లలోనో లేదా రెండు మూడు సినిమాల తర్వాత కానీ మంచి బ్రేక్ ని అందుకుంటారు. కానీ ఇంకొందరు మాత్రం జస్ట్ ఒక సినిమాతోనే మంచి ఆదరణ అందుకుంటారు.

కాగా లాంటి అతి తక్కువ మంది హీరోయిన్స్ లో మృణాల్ ఠాకూర్ కూడా ఒకామె అని చెప్పాలి నిజానికి హిందీ సినిమాలో మృణాల్ ఠాకూర్ చాలా చిన్న చిన్న పాత్రలు, సీరియల్స్ చేసుకుంటూ మాత్రమే ఉండేది. అక్కడ నుంచి మన తెలుగు సినిమాలోకి "సీతారామం" తో ఎంటర్ అయ్యి సీతగా చెరగని ముద్ర వేసుకుంది. ఆ సినిమాలో ఎంతో హోమ్లీగా కనిపించినప్పటికీ తనలోని హాట్ యాంగిల్ ని కూడా చూపించి అందరికీ షాకిచ్చింది.

mrunal thakur to romance with rrr Ajay Devgn here is full story

ఇక ఇదిలా ఉండగా వెంటనే మరో హిట్ ని కూడా ఆమె సొంతం చేసుకుంది. ఇలా టాలీవుడ్ లో వెంటవెంటనే ఆఫర్స్ అందుకుంది కానీ విజయ్ దేవరకొండతో చేసిన చిత్రం ది ఫ్యామిలీ స్టార్ తో డిజాస్టర్ అందుకుంది. అక్కడ నుంచి తెలుగు సినిమాకి దూరం అయ్యింది అనే టాక్ కూడా వచ్చింది. అక్కడ నుంచి కొన్ని నెలలు పాటుగా తెలుగులో మృణాల్ తలు నెక్స్ట్ సినిమా అది కూడా హీరోయిన్ గా ఏదీ ఓకే చెయ్యట్లేదు అంటూనే రూమర్స్ వచ్చాయి.

కానీ ఫైనల్ గా ఓ సినిమాని లాక్ చేసుకుంది తెలుగులో. కాగా ఇపుడు తన కెరీర్ లో మరో బిగ్ ఆఫర్ ని పట్టేసినట్టుగా సినీ వర్గాల్లో టాక్ వచ్చింది. అది హిందీలో ఓ క్రేజీ సీక్వెల్ లో ఆమె RRR నటుడు సరసన రొమాన్స్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. కాగా హిందీ సినిమాలో మన తెలుగు నుంచి హిట్ అయ్యిన పలు సినిమాలకి రీమేక్స్ ఇప్పటికీ వెళుతున్న సంగతి తెలిసిందే.

mrunal thakur to romance with rrr Ajay Devgn here is full story

కాగా అలా ఎప్పుడో 2012 లో నటుడు అజయ్ దేవగన్ హీరోగా చేసిన సినిమానే "సన్నాఫ్ సర్దార్". ఈ చిత్రాన్ని ఇదే అజయ్ దేవగన్ తో RRR కి వర్క్ చేసిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన "మర్యాద రామన్న" కి రీమేక్ గా హిందీలో తెరకెక్కించారు. కాగా ఈ సినిమాకి ఒరిజినల్ గా ఎలాంటి సీక్వెల్ లేనప్పటికీ హిందీలో మాత్రం సీక్వెల్ ని ప్రకటించారు.

కాగా ఇందులోనే మృణాల్ ఇపుడు ఆఫర్ అందుకున్నట్టుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనితో అజయ్ దేవగన్ సరసన రొమాన్స్ చేసేందుకు మృణాల్ సిద్ధం అయ్యిందని అంటున్నారు. మరి ఇపుడు తెలుగులో అడివి శేష్ సరసన డెకాయిట్ సినిమా చేస్తుండగా హిందీలో కూడా బిజీగా మారింది అని చెప్పవచ్చు. అన్నట్టు ఈ సినిమాని ఈ ఏడాది జూలై లోనే రిలీజ్ కి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి చూడాలి ఈసారి మృణాల్ ఎలా అలరిస్తుందో అనేది.

More from Filmibeat

Read more about: mrunal thakur rrr ajay devgn
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X