చిరంజీవి వేషంలో ఎమ్మెస్?

By Staff

MS Narayana
దాసరి నారాయణరావు నిర్మిస్తున్న మేస్త్రీ సినిమాలో కమెడియన్ ఎమ్మెస్ నారాయణ చిరంజీవి వేషంలో కనిపిస్తారని వినికిడి. ఈ సినిమాలో దాసరి టైటిల్ పాత్రను పోషిస్తున్నారు. చిరంజీవి రాజకీయ ఆరంగేట్రంపై దాసరి ఈ వ్యంగ్య చిత్రం నిర్మిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన విషయాలను ఆయన గుట్టుగా ఉంచుతున్నారు. ఈ సినిమాలో దాసరి శిష్యులు మోహన్ బాబు, శ్రీహరి కీలక పాత్రలు పోషిస్తున్నట్లు టాలీవుడ్ చెవులు కొరుక్కుంటోంది. దాసరి ఇటీవల అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. ఆయన కోలుకోవడంతో సినిమా నిర్మాణం ఊపందుకుంది. దాసరి శిష్యుల్లో ఒక్కరైన సురేష్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శాసనసభ ఎన్నికలకు ముందు ఈ చిత్రాన్ని విడుదల చేస్తారని అంటున్నారు. చిరంజీవి ముఠా మేస్త్రీ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ గుర్తుకొచ్చేలా మేస్త్రీ అని సినిమా పేరును ఖాయం చేసినట్లు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X