'దూకుడు'లో 'మగధీర' గెటప్ హైలెట్
అతి త్వరలో విడుదల కాబోతున్న మహేష్ దూకుడు చిత్రంలో ఎమ్ ఎస్ నారాయణదీ కీలకమైన రోల్ అని సెకెండాప్ లో జరిగే కామిడీలో కనిపిస్తాడని తెలుస్తోంది. విభిన్నమైన గెటప్ లలో కనిపించి నవ్విస్తాడని తెలుస్తోంది. ఈ చిత్రంలో హాస్య నటుడు ఎమ్ ఎస్ నారాయణ..మగధీర, ఆరెంజ్ చిత్రాలలను స్పూఫ్ చేస్తూ నటించారని తెలుస్తోంది. ఆ రెండు గెటప్ లలో ఎమ్ ఎస్ నారాయణ కనపిస్తున్న ఫోటోలు నెట్ లో కనిపిస్తున్నాయి. ఇక దూకుడులో మహేష్ బాబు పోలీస్ ఆపీసర్ గా కనిపించనున్నారు. అయితే తండ్రి కోరికను తీర్చే పోలీస్ ఆపీసర్ కథ అని తెలుస్తోంది. అలాగే మహేష్ ఈ చిత్రంలో తెలంగాణాకు చెందిన ఎమ్మల్యేగా కూడా కనిపించనున్నారు. తెలంగాణా స్లాంగ్ లో కనిపించి అలరించనున్నారు. దూకుడు సినిమా పోకిరి లాగానో, ఒక్కడు లాగానో ఉండాలని డిజైన్ చెయ్యలేదు. మంచి ఎమోషన్, కామిడీ ని కలిపి బ్లెండ్ చేస్తూ చెప్పిన ఒక కొడుకు కథ అంటున్నారు రచయిత గోపీ మోహన్.
ఆయన ఈ చిత్రం గురించి తన ట్విట్టర్ ఎక్కౌంట్ లో ఇలా ట్వీట్ చేసారు. అలాగే బేసిగ్గా నేను కృష్ణగారి అభిమానిని. కృష్ణగారు సాహసానికి మరో పేరని అంటుంటారు. ఈ సినిమాలో హీరో ఓ డైలాగ్ చెబుతాడు "మా నాన్నెప్పుడూ ఒకటంటుండేవాడు 'సాహసమే ఊపిరిగా బతికేవాడికి దారితో పనిలేదు దమ్ముతోనే పని' అని". ఈ డైలాగ్ మంచి సందర్భంలో వస్తుంది. దాన్ని అందరూ కృష్ణగారితో ఐడెంటిఫై చేసుకుంటారు అంటున్నారు రైటర్ గోపీమోహన్. అలాగే ఇందులోని డైలాగుల్లో 'పోకిరి' షేడ్స్, 'రెడీ' షేడ్స్ రెండూ కనిపిస్తాయి. అయితే ప్రేక్షకులకి ఇది కావాలని చేసినట్లు ఏమాత్రం అనిపించదు. కథే బలంగా ఎలివేట్ అవుతూ వెళ్తుంది. మీరు చూసినప్పుడు కూడా అదే ఫీలవుతారు అన్నారు.ఇక ఈ చిత్రంలో మహేష్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. కామిడి ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ, కోన వెంకట్ మాటలు అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











