కొడుకు కెరీర్ ని పణంగా పెట్టి ఎమ్.ఎస్.రాజు మళ్ళీ దర్శకత్వం
మెగా మేకర్ గా పేరు తెచ్చుకున్న ఎమ్.ఎస్.రాజు ప్రస్తుతం తన కుమారుడు సుమంత్ అశ్విన్ ని హీరోగా పెట్టి సినిమా చేస్తున్నారు. ఆయన దర్శకత్వం వహించిన వాన సినిమా భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఎలాగయినా ఒక్క సక్సెస్ ఇచ్చి డైరక్టర్ గా పేరు తెచ్చుకోవాలని ఆయన కసిగా ఉన్నారు. అందుకోసం కొడుకు కెరీర్ నే పణంగా పెడుతున్నారు. మొదట ఈ చిత్రానికి మనసంతా నువ్వే లాంటి హిట్ ఇచ్చిన వియన్ ఆదిత్యను దర్శకుడుగా అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన సీన్ లో లేరు. సుమంత్ సినిమా రాజ్ ను డైరక్ట్ చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. ఇక ఎమ్.ఎస్.రాజు తాను తయారు చేసుకున్న కథపై నమ్మకంతో ఈ సాహసం చేస్తున్నాడని సక్సెస్ అయ్యే అవకాశమే ఎక్కువుందని అంటున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు స్కీమ్ లో ఒకే సినిమాతో కొడుకు హీరోగానూ, తండ్రి దర్శకుడుగా, నిర్మాతగా బ్రేక్ రావాలని ప్లాన్ చేసారని చెప్పుకుంటున్నారు. సంక్రాంతి రాజుగా పేరు తెచ్చుకున్న ఎమ్.ఎస్.రాజు ఈ చిత్రాన్ని మాత్రం సమ్మర్ కి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.


Click it and Unblock the Notifications











