ఎట్టకేలకు ఎమ్.ఎస్.రాజు కొడుకు హీరో అవుతున్నాడు..డిటేల్స్
మనసంతా నువ్వే, ఒక్కడు, దేవి, దేవి పుత్రుడు వంటి భారి చిత్రాలు నిర్మించిన ఎమ్.ఎస్.రాజు తన కుమారుడు సుమంత్ అశ్విన్ ని హీరోగా లాంచ్ చేయటానికి చాలా కాలంగా ప్లాన్ చేస్తున్నారు. మొదట ఈ చిత్రానికి తేజ ని దర్శకుడుగా అనుకున్నా కేక చిత్రం చూసి జడుసుకున్న ఎమ్.ఎస్.రాజు ఆ ప్రయత్నం విరమించుకున్నారు. ఆ తర్వాత ప్రభుదేవాని దర్శకుడుగా అడిగి అతని రెమ్యునేషన్..ఓ చిత్రం బడ్జెట్ అంత ఉండటంతో వద్దనుకున్నారు. ఆ తర్వాత ఆయనే స్వయంగా డైరక్ట్ చేసేద్దామని ఓ నిర్ణయానికి వచ్చి కథను అల్లు కున్నారు. అయితే ఫైనాన్సియర్స్...మీరు డైరక్ట్ చేసిన వాన చిత్రం నుంచి జనం ఇంకా కోలుకోలేదు..మళ్ళీ వారి మీద ఎందుకు దాడి అన్నట్లు చెప్పటంతో అదీ వదిలేసారు.
ఫైనల్ గా తనే పరిచయం చేసిన దర్శకుడు వియన్ ఆదిత్యను లైన్ లోకి తీసుకొచ్చి తన కుమారుడు పరిచయం భాధ్యత అప్పచెప్పారు. నవంబర్ 17 న ఈ చిత్రం ఓపినింగ్ కానుంది. ఇంతకీ వియన్ ఆదిత్య ఏం చేస్తున్నారు అంటే రెయిన్ బో ప్లాపయ్యాక కొంత కాలం మీడియాని తిట్టి ఆ తర్వాత ఓ దర్సకుడు సగం చేసి వదిలేసిన తరుణ్ చుక్కలాంటి అమ్మాయి...చక్కనైన అమ్మాయి చిత్రాన్ని ఫినిష్ చేసాడు. కానీ అది రిలీజుకు నోచుకులేదు. ఆ తర్వాత ఇప్పుడు సుమంత్, ప్రియమణిలతో ఓ కొత్త దర్శకుడు సినిమా ప్రారంభించి చేతులెత్తేస్తే దానిని పూర్తి చేస్తున్నాడు. కాబట్టి ఎంతో మందితో కాదనుకున్న తన అబ్బాయి లాంచింగ్ కి వియన్ ఆదిత్యను ఎంపిక చేసుకోవటంలో అర్ధం ఉందనిపిస్తుంది. అలాగే ఈ కొత్త చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో పాటలు రికార్డింగ్ కూడా జరగింది. హీరోయిన్ గా ముంబై అమ్మాయిని ఎంపిక చేసారని చేసారు.


Click it and Unblock the Notifications











