twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్, చిరులపై విమర్శలున్న బుక్ రూ. 10 వేలు

    By Bojja Kumar
    |

    ms reddy
    ప్రముఖ సినీ నిర్మాత, రచయిత ఎంఎస్.రెడ్డి(మల్లెమాల) 'ఇది నా కథ' పేరుతో తన ఆత్మకథ రాసి పుస్తక రూపంలో ఆ మధ్య విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పుస్తకంలో తన సినీ జీవితంతో పాటు పరిశ్రమలో సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, గుణశేఖర్ లాంటి వారిపై విమర్శలు చేస్తూ...సాధారణ జనాలకు వారి మనస్తత్వం గురించి తెలియని విషయాలను బట్టబయలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినీ పరిశ్రమలో చీకటి కోణాల్ని కూడా తన పుస్తకంలో ఆవిష్కరించారు మల్లెమాల. ఈ పుస్తకంపై పరిశ్రమలో రగడ రేగిన నేపథ్యంలో ఎంఎస్.రెడ్డి తనయుడు శ్యాంప్రసాద్ రెడ్డి వెంటనే ఆ పుస్తకాలన్నింటినీ...మార్కెట్ నుంచి వెనక్కి తెప్పించారు.

    ఇటీవల ఎంఎస్.రెడ్డి మరణించిన నేపథ్యంలో....ఈ పుస్తకం మళ్లీ హాట్ టాపిక్ అయింది. ఆ పుస్తకాన్ని దక్కించుకోడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నా...ఎక్కడా దొరకడం లేదు. ఇదే అదునుగా తొలుత ఆ పుస్తకాన్ని దక్కించుకున్న కొందరు వ్యక్తలు, ఆపుస్తకాన్ని మరిన్ని కాపీలు తయారు చేయించి రూ. 10వేల చొప్పున గుట్టు చప్పుడు కాకుండా బ్లాక్‌లో అమ్ముతున్నట్లు ఫిల్మ్ నగర్ లో తాజాగా వినిపిస్తున్న సమాచారం.

    English summary
    A few months before his demise, MS Reddy wrote his biography titled 'Idhi Na Kadha'. The book looked like what reveals the dark side of Telugu Industry's big wigs and happening directors.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X