డేటిచ్చారు: మేనల్లుడు అయ్యాడు..ఇప్పుడు కొడుకు వంతు
హైదరాబాద్ : మెగా బ్రదర్ నాగబాబు మేనల్లుడు సాయి ధరమ్ తేజ సేఫ్ గా పిల్లా నువ్వు లేని జీవితం చిత్రంతో లాంచ్ అయ్యిన సంగతి తెలిసిందే. మొన్న శుక్రవారం విడుదలైన ఈ చిత్రం అన్ని ప్రాంతాల నుంచి మంచి రిపోర్టులే అందుతున్నాయి. ఈ ఉత్సాహంలో ఇప్పుడు నాగబాబు తన కుమారుడు వరుణ్ తేజ ని లాంచ్ చేయటానికి సన్నాహాలు స్పీడ్ చేసారు. వరుణ్ తేజ లాంచింగ్ చిత్రం ముకుందా ..ఆడియోకు తేదీని డిసెంబర్ 6 న ఖరారు చేసినట్లు సమాచారం. ఆ రోజే టీజర్ విడుదల చేసి, మిగతా వ్యవహారాలు ఫినిష్ చేసి పబ్లిసిటీ పెంచనున్నారు. విడుదలతేదీ కూడా అదే రోజు ఇస్తారని తెలుస్తోంది.
పాటలు తప్ప ఈ చిత్రం షూటింగ్ పూర్తైపోయింది. వరుణ్ తేజ ఇప్పటికే డబ్బింగ్ ప్రారంభించేసాడు. సినిమా చాలా బాగా వచ్చిందని, ఖచ్చితంగా ఓ లాండ్ మార్క్ సినిమాగా మిగులుతుందని చెప్తున్నారు. మెగా ఫ్యామిలీ మొత్తం ఈ చిత్రం విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అలాగే మెగాభిమానులు సైతం తమ క్యాంప్ నుంచి వస్తున్న కొత్త హీరో కోసం వెయిట్ చేస్తున్నారు.
నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ముకుంద'. పూజాహెగ్డే హీరోయిన్. ఈ చిత్రం దీపావళికి రిలీజ్ అవుతుందని అంతా భావించారు. అయితే రిలీజ్ కాలేదు. దానికి కారణం...శంకర్,విక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన ఐ చిత్రం అంటున్నారు. ఐ ని సైతం దీపావళికి విడుదల చేస్తామన్నారు. దాంతో ముకుందాని ఆపు చేసారు. కాని గ్రాఫిక్స్ లేటవటం, బిజెనస్ కూడా పూర్తి కాకపోవటంతో వాయిదా వేసారు.

చిత్రం విషయానికి వస్తే..
మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న మొదటి సినిమా ‘ముకుందా'. షూటింగ్ మొత్తం పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. వరుణ్‌తేజ్ ప్రస్తుతం డబ్బింగ్ చెబుతున్నాడు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తారు.
‘ముకుందా' ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నారు. ఇటీవలే విడుదల చేసిన వరుణ్‌తేజ్ ఫస్ట్‌లుక్ మరియు ఫస్ట్‌లుక్ టీజర్‌కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్‌తేజ్ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు.
సమర్పకుడు ఠాగూర్ మధు మాట్లాడుతూ ‘‘ఇటీవల గోదావరి జిల్లాల్లోని అందమైన లొకేషన్లలో 35రోజులు భారీ షెడ్యూల్ చేశాం. సినిమా బాగా వచ్చింది '' అని అన్నారు.
లియో ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తోంది. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే నాయికగా నటిస్తోంది. మిక్కీ.జె.మేయర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, రావు రమేష్, నాజర్ ఇందులో కీలక పాత్రధారులు.


Click it and Unblock the Notifications











