twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నట, యువ, నవ సామ్రాట్ ల కాన్సెప్ట్ కి గ్రీన్ సిగ్నల్...!

    By Sindhu
    |

    అక్కినేని నాగేశ్వర రావు నటవారసుడిగా ప్రవేశం చేసి హీరోగా అగ్రకదానాయకుల్లో ఒకరిగా నిలబడ్డారు నాగార్జున. తాజాగా ఆయన తనయుడు నాగచైతన్య కుడా హీరోగా రంగప్రవేశం చేసి యువహీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. అక్కినేని అభిమానుల ఆకాంక్షను అతి త్వరలోనే తీర్చే దిశగా సన్నాహాలు ఆరంభమయ్యాయి. నట సామ్రాట్ డా అక్కినేని నాగేశ్వర రావు-యువ సామ్రాట్ నాగార్జున-నవసామ్రాట్ నాగచైతన్యల కలయికలో ఓ భారీ మల్టీస్టారర్ తీసేందుకు నాగ్ ఆత్మీయ నిర్మాత శివప్రసాద్ రెడ్డి రంగం సిద్దం చేస్తున్నారు.

    ఆల్ రెడీ 'కింగ్" నాగార్జునతో ఓ సూపర్ హిట్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ మూడు తరాల అక్కినేని కథానాయకులకు సరిపోయే ఓ కాన్సెప్ట్ చెప్పారనీ, అది వినగానే నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి స్ర్కిప్ట్ రెడీ చెయ్యమంటూ ప్రోత్సహిస్తున్నారనీ తెలిసింది. అయితే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెల్ళేది మాత్రం వచ్చే ఏడాదిలోనేనట. ప్రస్తుతానికి మాత్రం నాగ్ బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 29 ఆ సినిమా వివరాలు వెల్లడించి అక్కినేని అభిమానులను ఉత్సాహపరిచే ప్లాన్ లో వుంది అన్నపూర్ణ కాంపౌండ్..!

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X