ముమైత్ ఖాన్ రేటెంతంటే...
హాట్ స్టార్ ముమైత్ ఖాన్ ఇప్పుడు హైయిస్ట్ పెయిడ్ ఐటం గర్ల్ గా పేరుతెచ్చుకుంటోంది. తాజాగా ఆమె రెమ్యునేషన్ ని ముఫ్పై లక్షలకు పెంచటంతో ఆమే టాప్ అంటున్నారు. మిగతా ఐటం గర్ల్స్ ఎవరూ కూడా ఈ రేటు దరిదాపులకు కూడా రావటంలేదని, అయినా విచిత్రంగా ఆమె డిమాండ్ తగ్గలేదని విశ్లేషిస్తున్నారు. దాంతో ఆమె కున్న ప్రత్యేకతలపై కూడా చర్చ జరుగుతోంది. తెరపై శృంగారాన్ని పండించటంలో ఆమె తన దైన శైలిలో విభిన్నంగా కనిపించటమే కారణమని తేలుస్తున్నారు. ఒకప్పుడు జ్యోతిలక్ష్మి, జయమాలని తరహాలో ఈ తరానికి ముమైత్ అని, ఆమె చివరకూ పోస్టర్ వ్యాల్యూ కూడా సంపాదించుకోవటం ప్లస్ అయిందంటున్నారు.
అంతేగాక ముమైత్ ఖాన్ పూర్తి స్ధాయిలో నటించిన సినిమాలు వర్కవుట్ కాకపోయినప్పటికీ ప్రత్యేకమైన గుర్తింపుతెచ్చాయని అదే ఆమె డిమాండ్ కి కారణమని అంటున్నారు. మరికొందరైతే ముమైత్ అంటే ముమైత్ అని వేరొకరని ఆమె స్ధానంలో ఊహించలేమని, ఆమె డాన్సింగ్ ఎబిలిటీస్, ఎరోటిక్ డాన్స్ స్టెప్స్, ఏ డ్రెస్ వేసుకున్నా సెక్సీగా ఉండటంతో ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ గా ఉండటంతో పెద్ద హీరోలు సైతం తమ సినిమాలో ఆమె ఐటం సాంగ్ ని కోరుకోవటం జరుగుతోందంటున్నారు. అలాగే ఆమె మీద పెట్టే ప్రతీ పైసా కి ప్రతిఫలం ఉండటమే ఇంతకాలం నిలబడటానికి ముఫ్పై లక్షలు తెచ్చుకోవటానికి రీజన్ అనేది నిజం.


Click it and Unblock the Notifications











