స్టార్ నైట్ లో రాజకీయాలు..ముమైత్ మండిపాటు
స్టార్ నైట్ కార్యక్రమంలో రాజకీయాలు జరిగాయని ఆ కమిటీపై మండిపడుతోంది ఐటంగర్ల్ ముమైత్ ఖాన్. స్టార్ నైట్ పోగ్రామ్ లో ఆమె పార్టిసిపేశన్ ఏమీ లేదు. ఆ విషయం ప్రస్దావిస్తూ..నన్ను ఓ పాట చేయమని కమిటీ కోరింది. నేను చాలా కష్టపడి ప్రాక్టీస్ చేసాను. అయితే చివరకు వచ్చేసరికి ..ఇది వరద బాధితులకోసం చేస్తున్న షో..కాబట్టి నువ్వు చేసే గ్లామర్ పాటలు చెయ్యద్దు..అంటూ ఎవాయిడ్ చేసారు. కానీ షో చూస్తే అన్నీ గ్లామర్ పాటలే..అందుకే రాజకీయం జరిగిందంటున్నారు. వారు మాట తప్పారు అంటోంది.బాలకృష్ణ నేతృత్వంలో దాసరి అధ్యక్షతన స్టార్ నైట్ పోగ్రాం సక్సెస్ ఫుల్ గా జరిగింది. అయితే అక్కడక్కడా ఇలాంటి అసంతృప్తి గళాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇంత పెద్ద పోగ్రామ్ కండెక్టు చేసేటప్పుడు ఇలాంటివన్నీ కామన్ అని అందరినీ సరిపుచ్చటం సాధ్యమయ్యే పని కాదని సినీ పెద్దలు ఈ మేటర్ పై కామెంట్ చేస్తున్నారు.ఇంతకు ముందు ముమైత్ దాసరి నిర్మించిన మైసమ్మ ఐపియస్ అనే ఫ్లాప్ చిత్రంలో హీరోయిన్ గా చేసింది.


Click it and Unblock the Notifications











