పబ్ లో అవమానానికి గురైన ముమైత్ ఖాన్
ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే అంటూ పోకిరిలో రెచ్చిపోయిన ముమైత్ కి ఈ మధ్యన టైమ్ అస్సలు బాగుండలేదు. ఒకటీ అరా సినిమాలతో నెట్టుకొస్తున్న ఆమె రీసెంట్ గా ఓ పబ్ కి వెళ్ళింది. అక్కడ ఆమె మల్లన్న చిత్రంలోని నా పేరే మీనా కుమారి పాటకు డాన్స్ చేయటం ప్రారంభించింది. పాటకు తగినట్లుగా సెక్సీగా నడుం ఊపుతూ డాన్స్ చేస్తున్న ఆమెకు మొదట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే పాట పూర్తయ్యేసరికి అక్కడ త్రాగి ఉన్న కొందరు ఆమె ఫిజిక్ పై కామెంట్స్ చేయటం మొదలెట్టారు. దాంతో ముమైత్ వాళ్ళని హెచ్చరించి మేనేజర్ ని పిలిచింది.
వాళ్ళని బయిటకు పంపించేయమని అరిచింది.అయితే వారంతా కోటీశ్వరలు బిడ్డలు కావటం,సమాజంలో మంచి పలుకుబడి ఉన్న పెద్దల పిల్లలు కావటంతో మేనేజర్ ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు. దాంతో ముమైత్ కి ఏం చేయాలో తోచని స్ధితి ఏర్పడింది. తమను బయిటకు పంపమన్న ముమైత్ ని వారు ఈ సారి నీ రేటు గంటికి వంద,యాభై అంటూ జేబులోంచి డబ్బులు తీసి అరవసాగారు. దాంతో వేరే దారిలేని స్ధితిలో ముమైత్ అవమానంతో ఆ పబ్ నుంచి బయిటకు వచ్చి ఇంకెప్పుడూ ఆ పబ్ కి బ్రతిమాలిడినా రానని శాపనార్ధాలు పెడుతూ వెళ్ళిపోయింది. ఇదంతా ఫిల్మ్ సర్కిల్స్ లో రీసెంట్ గా ఎవర్ని కదిపినా వినిపిస్తున్న కథనం.


Click it and Unblock the Notifications











