ఎన్నారైతో ముమైత్ తిరుగుళ్ళు?

By Staff

Mumaith Khan
తన హాట్ ..హాట్ అందాలుతో కుర్రాళ్ళుకు మతులు పోగెట్టే ముమైత్ ఖాన్ ఇప్పుడో ఎన్.ఆర్.ఐ ని పట్టిందని ఫిల్మ్ నగర్ సమాచారం. అతను ఆస్ట్రేలియా లో సెటిల్ అయిన ఇండియన్ ఫ్యామిలీకి చెందిన వాడుట. ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని దిగిన అతనితో ముమైత్ చెట్టాపట్టాలేసుకు తిరుగుతోందని అంటున్నారు. గత కొద్ది రోజులుగూ ఎక్కడచూసినా వీరి జంటే నంటున్నారు. ఇక క్రిందటి నెలలో వాళ్ళిద్దరూ ఓ పబ్ లో కలసారనీ,తర్వాత వారు దరిదాపు ప్రతీ రాత్రి అదే పబ్ లో పార్టీలు ఒకరికొకరు ఇచ్చుకుంటున్నారని చెప్తున్నారు.


చెన్నై కి కమల్ ని కలువటానికి వెళ్ళినప్పుడు కూడా ముమైత్ ఈ ఎన్నారైని వెంటబెట్టుకెళ్ళి పరిచయం చేసిందని అంటున్నారు. అక్కడే ఓ రెండు రోజులుండి మల్టీప్లెక్స్ లలో షాపింగ్ చేసారని ఖుషీ ఖుషీగా ఎంజాయి చేసారని తాము ప్రత్యక్షంగా చూసి పలకరించబోతే ఎవరో తెలియదన్నట్లు వెళ్ళిపోయిందని కొందరు ఆమె సన్నిహితులు వాపోతున్నారు. ఇక ఆ ముదురు కుర్రాడు బాగా ఫోష్ గా ఉన్నాడని డబ్బు లెక్కలేకుండా ఖర్చుపెడుతున్నాడని ఇండియాలో పెట్టుబడి పెడతానని వచ్చి ఆమెకే పెట్టుబడి పెడుతున్నాడని కామెంట్ చేస్తున్నారు.

ఆమెకు ఓ ప్లాట్ తీస్తానన్నాడని ప్లేస్ చెప్పమన్నాడనీ ఆమె తనకు పరిచయమున్న సినిమా వారికి ఫోన్ చేసి మంచి కాస్టలీ ఏరియాలో ప్లాట్ కొంటానని చూడమని పురమాయించిదనేది హాట్ టాపిక్.చివరకు అతను ఏ బిజెనెస్ పెడతాడో తెలియదు కానీ సినిమా మాత్రం స్టార్ట్ చేసే అవకాశాలున్నాయంటున్నారు. పోన్లేండి ముమైత్ పుణ్యమాని నలుగురికి పని దొరుకుతుందంటున్నారు.అయినా అదేంటో గానీ ఇక్కడికి వచ్చే ఎన్నారై లందరి దృష్టి ఆమెపైనే పడుతోందిట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X