ముమైత్ కి ఇక రెస్ట్?

By Staff

Muamith Khan
ఈ మథ్య ముమైత్ ని ఐటం సాంగ్ కోసంమో,హీరోయిన్ పాత్రం కోసమో ఆమెని కలిసన వారికి ఒకే సమాథానం ఎదురౌతోందట. మూడు నెలలు తర్వాత కలవమని...చెప్తోదిట. ఆమె రాబోయో మూడు నెలల్లో కంటిన్యూగా ఎవరికన్నా డేట్స్ ఇచ్చిందా అని ఎంక్వైరీ చేస్తే అలాంటిదేమీ లేదని తేలింది. మరి ఎందుకిలా చెప్తోంది అని అడిగితే రెస్ట్ తీసుకోవాలి అని చెప్తోందిట. వచ్చే డబ్బుని కూడా వదులుకోవటానికి సిద్దపడుతోందంటే వేరే కారణం ఉంటుందని అందరికి అర్ధం అయింది. నిజానికి తెలుగులో ఆమె డిమాండు మెల్లిగా తగ్గుతోంది. ఆమె సినిమాలు ఈ మథ్య వరసగా పరాజయాన్ని పొందుతూ డిప్రెషన్ కలుగచేస్తున్నాయి. ఈ పరిస్థితిలో మెగా హిట్ మరొకటి పడితేగాని కెరీర్ మళ్ళీ గాడిలో పడదని ఆమెకి అర్ధమైంది. అందుకోసం కొన్ని ఆఫర్లు సైతం వదులుకుని ఆమె 'బుజ్జిగాడు' లో ఐటం సాంగ్ చేసింది. కాని దాన్ని పట్టించుకున్న వాళ్ళు లేకుండా పోయారు. ఎందుకిలా జరుగుతోందని ఆలోచనలో పడిన ఆమెకు ఈ మధ్య తన ముఖంలోనూ, పొట్ట వద్ద బాగా క్రొవ్వు పెరిగింది అని అందరూ చేస్తున్న కామెంట్స్ గుర్తుకువచ్చాయి.

దాంతో ఆమె ఇప్పుడు చేస్తున్న 'టార్గెట్, పున్నమి నాగు' చిత్రాలు పూర్తిచేసి గ్యాప్ తీసుకుని కాస్మొటిక్ సర్జరీ చేయంచుకోవాలని నిర్ణయానికి వచ్చిందిట. అప్పుడు మరింత ప్రెష్ లుక్ తో కనపడవచ్చునని ఆమె ఆలోచనట. దానికోసం ముంబైలోని పేరున్న సర్జన్స్ ఉన్న హాస్పటల్ ని సంప్రదించిందిట. వారు సర్జరీ పూర్తయ్యాక రెస్ట్ అవసరమని, కొంత కాలం పాటు ఆహార,విహారాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వాటికి ప్రిపేరై రమ్మన్నారట. వాటిన్నటిని ముమైత్ ఓ.కె.చేసిందిట. గ్యాప్ కోసం ఎదురుచూస్తోందిట. అందుకని రాబోయే మూడు నెలల్లో కొత్తగా యే కమిట్ మెంట్స్ ఒప్పుకోనని నిర్మాతలుకు చెప్తోందిట. అంటే రాబోయే కాలంలో కొత్త ముమైత్ కనపడుతుందన్నమాట అని ఆమెతో సినిమాలు ప్లాన్ చేస్తున్న వాళ్ళు హ్యాపీ ఫీలవుతున్నారట. అయితే మరీ అంతలా సంబరపడకండి రెమ్యునేషన్ కూడా పెరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు సీనియర్లు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X