ముమైత్ నిర్మాత ఆత్మహత్యాయత్నం
ముమైత్ ఖాన్ కథానాయికగా వచ్చిన సినిమా 'టార్గెట్'. రమేష్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సంగిశెట్టి దశరథ్ నిర్మంచాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టడంతో నిర్మాత దశరథ్ అప్పుల ఊబిలో కూరుకు పోయారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి ఫైనాన్స్ చేసిన రామకృష్ణ, ల్యాబ్ ఇన్ చార్జ్ కళ్యాణ్ డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా దశరథ్ పై ఒత్తిడి తెచ్చారు.
దీంతో ఈ ఒత్తిడి తట్టుకోలేని దశరథ్ రెండు రోజుల ముందు ఒక లెటర్ రాసిపెట్టి ఇంట్లో నుండీ వెళ్లిపోయారు. ఈ ఉత్తరం చూసి ఆయన కుటుంబసభ్యలు పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారట. పోలీసులు ఈ కేసును విచారిస్తుండగా, తాజాగా దశరథ్ ఆత్మహత్యాయత్నం చేసారన్న వార్త బలంగా వినిపిస్తోంది. సినిమాలు జాగ్రత్తగా తీయకుండా, సరిగా మార్కట్ చేసుకోలేని వారికి ఈ ఉదంతం ఓ గుణపాఠం లాంటిది. ఇంతకు ముందు ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన 'నరసింహుడు' సినిమా నిర్మాత చెంగల వెంకట్రావ్ కూడా ఇదే విధంగా సినిమాను సరైన సమయంలో సినిమాను విడుదల చెయ్యలేక హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యాయత్నం చేసారు.


Click it and Unblock the Notifications