Don't Miss!
- News 'ఓటుకు నోటు' కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
- Finance IT News: టెక్ కంపెనీల్లో అత్యధిక జీతం ఆయనకే.. దేశీయ ఐటీ కంపెనీల్లో రికార్డు..
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. లాంచ్, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు..!!
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Lifestyle Marriage Day Wishes in Telugu : పెళ్లిరోజు శుభాకాంక్షల సందేశాలను ఇలా పంపండి..
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సెక్స్ బాంబ్ ముమైత్ ఖాన్ మరో అవతారం
త్వరలో ఐటం బాంబ్ ముమైత్ ఖాన్ లో మరో ప్రతిభా కోణం ఆవిష్కృతం కానుంది. ఆమె చేత తాజాగా దర్శకుడు పూరీ జగన్నాధ్ పాట పాడించి గాయనిగా మారుస్తున్నారు. పోకిరి చిత్రంలో ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే అంటూ ఐటం సాంగ్ చేయించి బిజీ చేయించిన పూరీ ఆమెను గోలీమార్ చిత్రంలో పాట పాడించటం ద్వారా బిజీ చేస్తున్నారు. అందులోనూ ఈ మధ్య ముమైత్ కు బిజీ తగ్గిన నేపధ్యంలో ఆమెను హైలెట్ చేసి తిరిగి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు పూరీ చేయూతనిస్తున్నారని చెప్తున్నారు.
ఇక గోలీమార్ చిత్రంలో గోపీచంద్ హీరోగా చేస్తున్నారు. ఇందులో గోపీచంద్ ఎనకౌంటర్ స్పెషలిస్టుగా కనిపిస్తారు. దయానాయక్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇక ఈ చిత్రంలో గోపీచంద్ సరసన ప్రియమణి హీరోయిన్ గా చేస్తోంది. ప్రియమణి నటించిన రీసెంట్ చిత్రం శంభో శివ శంభో చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకోవటంతో ఆమెను తీసుకోవటం చిత్రానికి ప్లస్ అంటున్నారు. ఇక పూరీ ఏక్ నిరంజన్ చిత్రం కూడా ఫెయిల్యూర్ అయిన ఈ దశలో ఆయనికీ మంచి హిట్ అవసరం. అలాగే శంఖం తో ఫ్లాప్ తెచ్చుకున్న గోపీచంద్ కు సయితం హిట్ అవసరం తో ఈ సినిమా మంచి కసితో చేస్తున్నట్లు సమాచారం.