ముమైత్ మ్యాటర్ పై అలీ ఇంట్లో..

అలాగే స్క్రీన్ మీద అలాంటి బట్టలు వేసుకుని,బయిట ఇలాంటి మాటలు మాట్లాడుతూంటే ఎలా నమ్ముతాం అని అంతా అనుకోవచ్చు...కానీ వాళ్ళు రెండిటికీ తేడా తెలుసుకోవాలి...ఆఫీసుకు వెళ్ళే వాళ్ళు టై వేసుకుని ఎలా వెళతారో..నేను నా జాబ్ కి తగ్గ బట్టలు వేసుకుంటున్నాను..అంటూ సమర్ధించుకుంది. పూరీ కూడా వెంటనే తడుముకోకుండా..అంతే..ఎంటర్ టైనింగ్ ద పబ్లిక్ ఈజ్ పార్ట్ ఆఫ్ హర్ జాబ్ అన్నారు. ఇక ముమైత్ ఖాన్ అలీ తమ్ముడు ఖయ్యాం మధ్య ప్రేమ నడుస్తోందని...పెళ్ళి చేసుకోబోతోందని గత కొద్ది రోజులుగా రూమర్స్ వస్తున్నాయి.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకనే ముమాయిత్ పై గ్యాసిప్స్ రాయద్దు అంటూ నేనింతే సినిమాలో పూరీ చెప్పించారు కూడా . అయితే అది సరిగ్గా రిజిస్టర్ కాలేదేమోనని మళ్ళి ఎందుకైనా మంచిదని ఆ న్యూస్ పేపర్ ద్వారా ముమైయిత్,పూరీ ఖయ్యా పెళ్లి గ్యాస్పిప్పే నమ్మద్దు అని వివరణ ఇచ్చారు. పూరీ అదే విషయం చెబతూ ..మొన్న ఖయ్యాం తనదగ్గరకొచ్చి....అన్నా ..మా ఇద్దరి గురించి ఎలా రాస్తున్నారో చూడు..ఇంట్లో అన్న అలీ తిడుతున్నాడన్నా..నాకస్సలు ఆ అమ్మాయి తెలియను కూడా తెలియదు...అని మొత్తుకున్నాడు అని చెప్పుకొచ్చాడు.అది నిజమే అయ్యుండవచ్చు..దాంతో అప్పటిదాకా ఆ విషయం గురించి తెలియని వారికి కూడా తెలియచెప్పినట్లుయిందని పరిశ్రమ వర్గాల టాక్.
ఎందుకంటే వెబ్ మీడియా కన్నా విపరీతమైన ప్రజాదారణకలది ప్రింట్ మీడియా. అలాంటి ఓ పాపులర్ పత్రికిచ్చిన ఇంటర్వూలో ముమైయిత్ ఆ విషయాన్ని ఎత్తటం ద్వారా ఈ మ్యాటర్ గురించి తెలియని చాలా మందికి తెలియచెప్పినట్లయింది అంటున్నారు. పేపరు తో పోలిస్తే...అతి తక్కువమంది..మాత్రమే చూసే వెబ్ సైట్స్ గాసిప్ ని ఖండించటానికి ఎంతో పాపులారిటి కల్గిన పేపరు మీడియాని ఎంచుకోవటం ఎందుకో ఎవరికి అర్ధం కాలేదు. అనవసరంగా తమ నోటి ద్వారానే తెలియని చాలా మందికి ఈ విషయం తెలియచెప్పినట్లియింది కదా అంటున్నారు.అదీ సంగతి.


Click it and Unblock the Notifications











