మహేష్, రామ్ చరణ్ అంటూ క్రేజీ రూమర్
మహేష్ బాబు, రామ్ చరణ్ కాంబినేషన్ లో మురగదాస్ ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నారంటూ ఓ రూమర్ ప్రారంభమైంది. దూకుడు, మగధీరలతో కొట్టుకుంటున్న ఫ్యాన్స్ ను చల్లార్చటానికా అన్నట్లు ఇది చాలా వేగంగా నెట్ లో ప్రయాణిస్తోంది. మల్టి స్టారర్ సినిమాలకు మహేష్ తన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో ప్రారంభించారనే సంగతి తెలిసిందే. దాంతో ఈ తరహా వార్తలు మొదలయ్యాయి. మురగదాస్ మీడియాతో మాట్లాడుతూ మహేష్ లేదా రామ్ చరణ్ లతో సినిమా చేసే అవకాశముందని అన్నారు. దాన్ని మహేష్, రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమాగా ప్రచారం చేస్తున్నారు. అయితే నిజంగా ఈ కాంబినేషన్ గనుక మురగదాస్ సెట్ చేయగలిగితే అధ్బుతమే అంటున్నారు. ఇక ఈ కాంబినేషన్ మ్యాటర్ ని ప్రక్కన పెడితే మురగదాస్ కి రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాశం ఎక్కువ ఉందని తెలుస్తోంది.
ఎందుకంటే మహేష్ రెండేళ్ల దాకా డేట్స్ ఇచ్చేసి ఫుల్ బిజీగా ఉన్నాడు. రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న రచ్చ, ఆ తర్వాత వినాయిక్ చిత్రాలు మాత్రమే ఉన్నాయి. సెవెంత్ సెన్స్ రిలీజ్ అయ్యాక మురగదాస్ కన్ను తెలుగుపై పడింది. అంతా హిందిలో అక్షయ్ కుమార్ తో ఠాగూర్ రీమేక్ చేస్తారనుకున్నారు. కానీ షారూఖ్, అక్షయ్ ఇప్పట్లో డేట్స్ ఎడ్జెస్ట్ చేసే పరిస్ధితి కనపడటం లేదు. మరో ప్రక్క తమిళంలోనూ సెవెంత్ సెన్స్ వర్కవుట్ కాకపోవటంతో స్టార్ హీరోలు కాస్త వెనకంజ వేసే అవకాసం ఉంది. ఈ నేపధ్యంలో తెలుగులో ఓ హిట్టు కొట్టి తన ప్రయాణాన్ని కొనసాగించాలని మురగదాస్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











