టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పెళ్లి.. వధువు ఎవరో తెలుసా?
ఇండియాస్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. తను కొన్నాళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్న అమ్మాయితోనే పెళ్లి చేసుకోబోతున్నారని అంటున్నారు. ఈ మేరకు కోలీవుడ్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. గతంలోనూ రూమర్లు వచ్చినా అవి పెద్దగా ఫలించలేదు. కానీ తాజాగా మాత్రం అనిరుధ్ రవిచంద్రన్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు? ఎప్పుడు పెళ్లి అనే విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
అనిరుధ్ రవిచంద్రన్ లవ్ స్టోరీస్..
తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ కోలీవుడ్ లోనే కాకుండా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు.ఈ క్రమంలో చాలా మంది హీరోయిన్లతో అనిరుధ్ రవిచంద్రన్ కలిసి పనిచేశారు. అయితే అనిరుధ్ రవిచంద్రన్ కు కీర్తి సురేశ్ తో ప్రేమాయణం సాగిందంటూ కొన్నాళ్లు ప్రచారం జరిగింది. కానీ గతేడాది కీర్తి సురేశ్ తన చిన్ననాటి స్నేహితుడి పెళ్లి చేసుకోవడంతో ఆ రూమర్లకు చెక్ పడింది. అవన్నీ అవాస్తవాలనీ తేలిపోయింది. ఇక తాజాగా మరోసారి అనిరుధ్ రవిచంద్రన్ పెళ్లి అంటూ వార్తలు మొదలయ్యాయి.

కొన్నాళ్లుగా ఆమెతో రిలేషన్ షిప్..
అనిరుధ్ రవిచంద్రన్ కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలారని తెలుస్తోంది. ఎస్ఆర్ హెచ్ ఓనర్ కావ్య మారన్ తోనే అనిరుధ్ రవిచంద్రన్ ప్రేమాయణం నడిపించారంట. ఆమె కూడా అనిరుధ్ తో ప్రేమలో పడిందని, కొన్నాళ్లుగా వీరి రిలేషన్ షిప్ కొనసాగుతోందని కోలీవుడ్ మీడియా తెలుస్తోంది. ఇక త్వరలోనే వీరి పెళ్లి వార్త అఫీషియల్ గా అనౌన్స్ కానుందని అంటున్నారు. ఇప్పటి వరకైతే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం లేదు. కోలీవుడ్ మీడియాలో మాత్రం గట్టిగానే ఈ మేరకు ప్రచారం జరుగుతోంది.
ఎవరీ కావ్య మారన్..
కావ్య మారన్ పూర్తి పేరు కావ్య కళానిథి మారన్. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్. సన్ గ్రూప్ ఫౌండర్, చైర్మ్ కళానిథి మారన్ కూతుర కావ్య మారన్. సన్ నెట్ వర్క్, సన్ పిక్చర్స్, సన్ టీవీ, ఇలా చాలా సంస్థలకు కళానిధి అధిపతి. వేల కోట్లకు కావ్య మారన్ వారసురాలు. ఇక అనిరుధ్ రవిచంద్రన్ సన్ పిక్చర్స్ లో వచ్చిన పలు చిత్రాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు. ఈ క్రమంలోనే వీరిద్దరికి పరిచయం ఏర్పడిందని ప్రచారం జరుగుతోంది.
అనిరుధ్ రెమ్యునరేషన్.. నెక్ట్స్ చిత్రాలు..
టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తన కెరీయర్ ను ధనుష్ 3 చిత్రంతో ప్రారంభించారు. ఆ సినిమాకు అనిరుధ్ అందించిన అన్ని సాంగ్స్ దుమ్ములేపాయి. ఇప్పటికీ హిట్ సాంగ్స్ తో సంగీత ప్రియుల ప్లే లిస్ట్ లో మోగుతున్నాయి. చివరిగా జైలర్, జవాన్, ఇండియన్ 2, దేవర, విడుదాముయార్చి వంటి చిత్రాలకు బ్లాక్ బాస్టర్ మ్యూజిక్ అందించారు. నెక్ట్స్ విజయ్ దేవరకొండ కింగ్డమ్, కూలీ, లవ్ ఇన్సూరెన్స్, జన నాయగన్, ది పారడైస్, జైలర్ 2, షారుఖ్ ఖాన్ కింగ్ చిత్రాలకు సంగీతం అందిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈయన ఒక్క సినిమాకు రూ.10 కోట్లు ఛార్జ్ చేస్తారు.


Click it and Unblock the Notifications











