Devi Sri Prasad: పెళ్లి చేసుకోనున్న దేవి శ్రీ ప్రసాద్.. షాకింగ్ గా వధువు వయసు.. ఆమె ఎవరంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లలో దేవి శ్రీ ప్రసాద్ ఒకరు. ఆయన మ్యూజిక్ తో ఆడియెన్స్ ను ఉర్రూతలూగిస్తారు. దేవి ఒక సినిమాకు మ్యూజిక్ చేస్తే మినిమం హిట్ అన్న పేరు ఉంది. ఎప్పటికప్పుడు కొత్త పంథాలో మ్యూజిక్ కంపోజ్ చేస్తూ దూసుకుపోతున్నాడు. యంగ్ అండ్ ఓల్డ్ జనరేషన్ వరకు దేవీ సంగీతం అంటే ఇష్టపడని వారుండరు. ఇక ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ నటించిన వాల్తేరు వీరయ్య సినిమాతో మరోసారి మ్యూజిక్ డైరెక్టర్ గా తానేంటో నిరూపించుకున్నాడు దేవి శ్రీ ప్రసాద్. అయితే ఇప్పుడు ఆయన పెళ్లి వార్తలు మరోసారి సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..

 టాలెంట్ చూసి..

టాలెంట్ చూసి..

నిత్యం తన మ్యూజిక్ తో టాలీవుడ్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్. కేవలం 17 ఏళ్ల చిన్న వయసులోనే దేవి అనే సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. దేవి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అలాంటి భారీ సినిమాకు అతి చిన్న వయసులోనే అంత గొప్ప సంగీతం ఇవ్వడంతో దేవి శ్రీ ప్రసాద్ టాలెంట్ చూసి టాలీవుడ్ ఆశ్చర్యపోయింది. దీంతో ఆ సినిమా టైటిల్ నే తన పేరులో దేవిగా యాడ్ చేసుకున్నాడు.

నిరూపించుకుంటూ..

నిరూపించుకుంటూ..

దేవి సినిమా తర్వాత కాస్తా గ్యాప్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్.. స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ ఇచ్చాడు. చిరంజీవి నుంచి అల్లు అర్జున్ వరకు అందరూ హీరోలకు ఇప్పటివరకు ఎన్నో సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్స్ అందించాడు. తన సంగీతంతో తెలుగు ప్రేక్షకుల నుంచి ఎన్నో రివార్డులతోపాటు.. అవార్డులను సైతం గెలుచుకున్నాడు దేవీ శ్రీ ప్రసాద్. ఇక దేవి పని అయిపోయిందన్న ప్రతి సారి తానేంటో నిరూపించుకూ ముందుకు సాగుతున్నాడు.

రిలేషన్స్ పై రూమర్స్..

రిలేషన్స్ పై రూమర్స్..

విమర్శలు చేసిన వారి నోర్లు మూయించాడు దేవీ శ్రీ ప్రసాద్. అయితే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ అయిన దేవీ శ్రీ ప్రసాద్ పెళ్లి, రిలేషన్స్ పై అనేక రూమర్స్ సైతం వచ్చాయి. 43 ఏళ్ల వయసున్న ఈ మ్యూజిక్ డైరెక్టర్ గత పదేళ్ల నుంచి పెళ్లి చేసుకుంటాడు అని వార్తలు వస్తున్నాయి. కానీ అలా ఏం జరగలేదు. అయితే దేవి శ్రీ ప్రసాద్ పై రిలేషన్ షిప్స్ రూమర్స్ కూడా వచ్చాయి. గతంలో హీరోయిన్ ఛార్మీతో దేవి ప్రేమలో పడ్డాడని పుకార్లు హల్ చల్ చేశాయి.

పెళ్లి చేసుకునేందుకు..

పెళ్లి చేసుకునేందుకు..

అనంతరం దేవీ శ్రీ ప్రసాద్, బొద్దుగుమ్మ బ్యూటిఫుల్ ఛార్మీ బ్రేకప్ చెప్పుకున్నారని మరో వార్త చక్కర్లు కొట్టింది. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా మరోసారి తెరపైకి దేవీ శ్రీ పెళ్లి ప్రస్తావన వచ్చింది. తన బంధువుల్లో ఒక అమ్మాయిని దేవీ శ్రీ ప్రసాద్ వివాహం చేసుకోబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. కుటుంబ సమక్షంలో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు దేవి నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఏకంగా అన్నేళ్లు చిన్నది..

ఏకంగా అన్నేళ్లు చిన్నది..

అయితే దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకునే అమ్మాయి వయసు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దేవికి వరుసకు మరదలు అయ్యే కాబోయే భార్య వయసు 26 సంవత్సరాలు. దేవీ శ్రీ ప్రసాద్ కు 43 ఏళ్లు. అంటే వయసులో ఆ అమ్మాయి దేవి శ్రీ ప్రసాద్ కంటే ఏకంగా 17 ఏళ్లు చిన్నది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ దేవి ఓ ఇంటివాడు అయితే ఆనందించేందుకు అతని ఫ్యాన్స్ మాత్రం రెడీగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X