Devi Sri Prasad: నక్కతోక తొక్కిన స్టార్ సింగర్.. ఏకంగా దేవీ శ్రీ ప్రసాద్‌తో ఏడడుగులు

తెలుగు సినీ పరిశ్రమనే కాదు.. హిందీ సహా దక్షిణాదిలో సినీ పరిశ్రమల్లో అనేక సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా మ్యూజిక్ అందించి మంచి క్రేజ్ సంపాదించాడు. దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తుతానికి చెన్నైలోనే సెటిల్ అయిన ఈయన ఎలాంటి భాషలో సినిమా వచ్చిన ఒప్పేసుకుంటూ చేసుకుంటూ వెళుతున్నాడు. నాలుగు పదుల వయసు దాటినా ఇంకా వివాహం కాని ఈయన ఫలానా హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఎప్పటికప్పుడు వార్తలు తెరమీదకి రావడం కామన్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఒక సింగర్ తో ఏడు అడుగులు వేయబోతున్నాడు అనే వార్త టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

ఒకానొక దశలో టాలీవుడ్ లో ఏ సినిమాకి మ్యూజిక్ ఇవ్వాలన్నా... ముందుగా దేవిశ్రీప్రసాద్ అనే పేరు వినిపించేది. ఇప్పుడు కొత్తగా తమ సహా పలువురు మలయాళ కన్నడ సినీ పరిశ్రమలకు చెందిన మ్యూజిక్ డైరెక్టర్లు తోడవడంతో దేవి శ్రీ ప్రసాద్ హవా కొంత తగ్గిందనుకోవచ్చు. అయితే పుష్ప లాంటి చాట్ పోస్టర్స్ ఇవ్వడంతో ఆయనతో ఇంకా పనిచేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తూనే ఉన్నారు.

Devi Sri Prasad

అయితే ఆ మధ్య ఆయన పూజిత పొన్నాడతో ప్రేమలో ఉన్నాడని వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదని ఇందులో ఎలాంటి వార్తలు నిజమయ్యే అవకాశం లేదని దేవి శ్రీ ప్రసాద్ సహా హీరోయిన్ కూడా క్లారిటీ ఇచ్చింది. అయితే ఇప్పుడు మరోసారి దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి వార్తలు తెరమీదకి వస్తున్నాయి.

Devi Sri Prasad

అసలు విషయం ఏమిటంటే మంగ్లీ సోదరి ఇంద్రావతి గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మంగ్లీ అంతగా ఫేమస్ అవ్వకపోయినా ఒకే ఒక్క సాంగ్ తో ఆమె సూపర్ క్రేజ్ అందుకుంది. పుష్ప సినిమాలో సమంత చేసిన ఐటెం సాంగ్ ఆమె స్వయంగా పాడింది. ఈ అవకాశం ఇచ్చిందే దేవి శ్రీ ప్రసాద్. ఈ నేపథ్యంలో దేవిశ్రీప్రసాద్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ కొన్ని ఫోటోలను ఇంద్రావతి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.

Devi Sri Prasad

ఇంకేముంది దేవి శ్రీ ప్రసాద్, ఇంద్రావతి మధ్య సాన్నిహిత్యం కల్పిస్తూ ఉండడంతో నెటిజన్లు రకరకాల కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ఒకరు పెళ్లెప్పుడు అని అడిగితే మరొకరు ఏజ్ ఒక నెంబర్ మాత్రమే అన్నట్టుగా కామెంట్ చేశారు. దీంతో వీరిద్దరికీ వివాహం జరగబోతుందా అనే కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందనే విషయం మీద వారు క్లారిటీ ఇస్తే తప్ప బయటకి తెలిసే అవకాశం లేదు.

Devi Sri Prasad

అయితే ఒకానొక సందర్భంలో ఇంద్రావతి మళ్లీ ఎందుకు పాటలు జోలికి రావడం లేదు అని మంగ్లీని ప్రశ్నిస్తే ప్రస్తుతం ఆమె చదువుకుంటుందని చదువు మీద ఫోకస్ పెట్టేందుకు పూర్తిస్థాయిలో ఇంకా సింగింగ్ ఫీల్డ్ లోకి రాలేదని మంగ్లీ చెప్పుకొచ్చింది. కాబట్టి దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారాలన్నీ నిజం కాకపోవచ్చు. బహుశా ఆ ఫోటోలను చూసి పెట్టిన కామెంట్లన్నీ వారి వారి వ్యక్తి గతం అయి ఉండవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X