రెండు వారాల్లో రిలీజ్.. ‘మజిలీ’ నుంచి తప్పుకున్న మ్యూజిక్ డైరెక్టర్?
అక్కినేని నాగచైతన్య, సమంత వివాహం తర్వాత కలిసి నటిస్తున్న చిత్రం 'మజిలీ'. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గరపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న వేళ 'మజిలీ' గురించిన ఓ గాసిప్ ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయింది. ఈ చిత్రానికి సంగీతం అందించిన గోపీ సుందర్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట. అందుకు గల కారణాలు ఏమిటో తెలియడం లేదు.

ఇంకా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా పూర్తి కాలేదని, దీన్ని పూర్తి చేయడానికి నిర్మాతలు తమన్‌ను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం ఇంకా అఫీషియల్‌గా ప్రకటించలేదు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
దేర్ ఈజ్ లవ్.. దేర్ ఈజ్ పెయిన్ అనే ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఈ మూవీ వైజాగ్ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో చైతూ క్రికెటర్‌గా కనిపించబోతున్నారు. రావు రమేష్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజ్ ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గరపాటి, హరీష్ పెద్ది మజిలి సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: శివ నిర్వాన, సంగీతం: గోపీ సుందర్, సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ, ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్, ఎడిటర్: ప‌్రవీణ్ పూడి, యాక్షన్: వెంకట్.


Click it and Unblock the Notifications











