Salaar Movie: ప్రభాస్ సలార్ ఆ సినిమాకు రీమేక్... క్లారిటీ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్
దేశం మొత్తం ఎదురుచూస్తున్న సినిమాల్లో ప్రభాస్ సలార్. ఈ సినిమాను కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఉగ్రం సినిమాకు రీమేక్ అని గతంలో వార్తలు వచ్చాయి. ఇక దానిపై ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ క్లారిటీ ఇచ్చాడు. ఆయన ఏం చెప్పారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న చిత్రం సలార్ సీజ్ ఫైర్. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. బహుబలి సీరిస్ తర్వత ప్రభాస్ కు ఆ రేంజులో హిట్టు పడలేదు. ఆయన నటించిన సాహో, రాధేశ్యాం, ఆదిపురుష్ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఇప్పుడు ఫ్యాన్స్ అంతా సలార్ సినిమపైనే హోప్స్ పెట్టుకున్నారు.

రెండు పార్టులుగా: ప్రశాంత్ నీల్ ఇప్పటికే కేజీఎఫ్ సీరిస్ తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో సలార్ సినిమా వస్తుంది. ఇక ఈ చిత్రాన్ని దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్తో హోంబలే ఫిలిం బ్యానర్ పై విజయ్ కిరగందూర్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రెండు పార్టులుగా రానుంది.
గ్యాంగ్ స్టర్ ఎంటర్ టైనర్: సలార్ సినిమా ఇప్పటికే సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సి ఉండగా... మేకర్స్ పోస్ట్ పోన్ చేశారు. ఇక ఈ మూవీ డిసెంబర్ 22న క్రిస్మస్ కానుకగా రానున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. గ్యాంగ్ స్టర్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ నటిస్తుంది. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు.

రీమేట్ అంటూ క్లారిటీ: అయితే సలార్ సినిమా ఉగ్రం సినిమాకు రీమేక్ అంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అసలు ఈ ఉగ్రం మూవీ కన్నడంలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిందే. ఈ విషయంపై మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ను మీడియా ప్రతినిధులు అడగ్గా... ఆయన అవును అంటూ సమాధానం చెప్పారు. దీనితో సలార్ సినిమా ఉగ్రం మూవీకి రీమేక్ అంటూ మళ్లీ వార్తలు ట్రెండ్ అవుతున్నాయి.

అయినా హిట్టు కన్ఫార్మ్: 2014లో రిలీజైన ఉగ్రం మూవీ కన్నడ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది. ఒక సామాన్య వ్యక్తి డాన్ గా ఎలా ఎదిగాడు అనే కథాశంతో ఈ సినిమా తెరకెక్కింది. మరి సలార్ కథ కూడా ఇలాగే ఉంటుందని.. ప్రభాస్ ఇమేజ్ కు తగ్గట్లు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తారని తెలుస్తోంది. అయితే ఇది మంచి కమర్షియల్ కథ అని తెలుస్తుండగా.. ప్రభాస్ కు ఇలాంటి కథ పడితే.. సూపర్ హిట్టు ఖాయమని అంటున్నారు. మరి నిజంగానే ఉగ్రం సినిమాకు రిమేక్ అయినా.. హిట్టు కన్ఫార్మ్ అంటున్నారు సినీ విశ్లేషకులు.


Click it and Unblock the Notifications











