‘సాహో’ నుంచి వారిని లేపేశారా? తెరవెనక ఏం జరుగుతోంది?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముందుగా చెప్పినట్లుగానే సర్‌ప్రైజ్ ఇచ్చారు. మంగళవారం తన సోషల్ మీడియా పేజీ ద్వారా 'సాహో' రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేశారు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో 'సాహో'పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ వారు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా 'సాహో' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే తాజాగా విడుదలైన పోస్టర్లో ఒక ముఖ్యమైన అంశం మిస్సవ్వడం హాట్ టాపిక్ అయింది.

‘సాహో' పోస్టర్ నుంచి వారిని ఎందుకు లేపేశారు?
సాధారణంగా ఏ సినిమా పోస్టర్ రిలీజ్ చేసినా... అందులో దర్శకుడు, నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ పేరు తప్పకుండా ఉంటాయి. అయితే తాజాగా విడుదలైన పోస్టర్లో సంగీత అందిస్తున్న మ్యూజిక్ త్రయం శంకర్-ఎస్సాన్-లాయ్ పేరు లేక పోవడం చర్చనీయాంశం అయింది.

తెర వెనక ఏం జరుగుతోంది?
గత రెండేళ్లుగా సాహో షూటింగ్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా సంగీత దర్శకుల ప్రస్తావన రాలేదు. వారు కూడా మీడియాతో ఇప్పటి వరకు ‘సాహో' గురించి మాట్లాడింది లేదు. ఇపుడు పోస్టర్ మీద వారి పేర్లు మాయం కావడంతో తెర వెనక ఏం జరుగుతోంది? ఇంతకీ వారు ‘సాహో'కు సంగీతం అందిస్తున్నారా? లేదా? అనే కొత్త అనుమానాలు మొదలయ్యాయి.

చిత్ర బృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది
గతంలో ‘సాహో' టీజర్‌కు తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించడంతో చాలా మందికి డౌట్ వచ్చింది. అయితే ఆ సమయంలోనే నిర్మాతలు దీనిపై క్లారిటీ ఇచ్చారు. శంకర్-ఎస్సాన్-లాయ్ ‘సాహో'కు అద్భుతమైన సంగీతం సమకూరుస్తున్నట్లు తెలిపారు. మరి ఇపుడు ‘సాహో' పోస్టర్ మీద వారి పేర్లు మిస్సవడం మానవ తప్పిదమా? ఇంకేమైనా విషయం ఉందా? అనే దానిపై నిర్మాతల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

సాహో
‘సాహో' చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. ప్రభాస్, శ్రద్ధా కపూర్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, వెన్నెల కిషోర్, ఎవలీన్ శర్మ, మురళీ శర్మ, ఆదిత్య శ్రీవాస్తవ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











