నెంబర్ వన్ హీరో అనిపించుకోవడమే నా లక్ష్యం: జూనియర్ ఎన్టీఆర్!
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ 2010వ సంవత్సరాన్ని 'అదుర్స్" సినిమాతో ఘనంగా ప్రారంభించాడు. తన కెరీర్ లో తొలిసారి సంక్రాంతి హిట్ ని అందించి అభిమానులని ఆనందింపజేశాడు. తాజాగా ఎన్టీఆర్ నటిస్తున్న 'బృందావనం" ఆగస్టు లో విడుదలకు సిద్ధమవుతోంది. వచ్చే సంక్రాంతికి 'శక్తి" విడుదల కానుంది. ఎన్టీఆర్ నట జీవితంలో 'శక్తి" అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించబడుతోంది అని సమాచారం.
వృత్తిపరంగానే కాకుండా, వ్యక్తిగతంగా కూడా ఎన్టీఆర్ కి 2010 వ సంవత్సరం మరపురానిదిగా నిలిచిపోతుంది. లక్ష్మీ ప్రణతి తో నిశ్చితార్ధం జరిగిన ఎన్టీఆర్ వచ్చేనవంబర్‌లో మూడుముళ్ళ బంధంతో ఒక ఇంటివాడు కాబోతున్నాడు. తన తాతగారైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి 'నటలక్షణాలను" పుణికిపుచ్చుకున్న జూ ఎన్టీఆర్, టాలీవుడ్ లో అగ్రకథానాయకుడి పీఠాన్ని అధిష్టించాలని ఉవ్విళ్ళూరుతున్నాడు.
తన జీవితంలో అందరితో నెంబర్ వన్ హీరో అనిపించుకోవడమే తన లక్ష్యమని ఎన్టీఆర్ గతంలో అనేక సందర్భాలో చెప్పాడు. ఇప్పటికే ఆ దిశగా వడివడిగా అడుగులేస్తున్న ఎన్టీఆర్, త్వరలోనే తన లక్ష్యాన్ని చేరుకోవాలని..వృత్తిపరంగా, వ్యక్తిగతంగా తాను చేపట్టే అన్ని పనుల్లో అదృష్టం తన వెంటే ఉండాలని ఆకాంక్షిదాం.


Click it and Unblock the Notifications











