నాకు గ్రేట్ గ్లామర్ ఇమేజ్ ఇచ్చిన జూ ఎన్టీఆర్ 'అదుర్స్’
బాలకృష్ణ సరసన ఇటీవల 'పరమవీరచక్ర'లో కనిపించిన అందాల తార షీలా అదివరకు ఎన్టీఆర్ కి జోడీగా 'అదుర్స్' అనిపించిన సంగతి తెలిసిందే. ఇలా బాబాయ్, అబ్బాయ్ ఇద్దరితోనూ జోడీగా నటించిన ఆమె ఒక్కొక్క సినిమాకీ గ్యాప్ తీసుకుంటూ వస్తోంది. 'ఏ సినిమా పడితే ఆ సినిమా చేస్తే నావి కూడా ఓ అరడజను సినిమాలు వచ్చి ఉండేవి.
ఎన్ని సినిమాలు చేశాననే దానికంటే ఎన్ని మంచి సినిమాలు చేశాననే దానిపైనే నా దృష్టి. జూ ఎన్టీఆర్ 'అదుర్స్' తో నాకు చక్కని గ్లామర్ ఇమేజ్ తెచ్చి పెట్టింది. ఆ ఇమేజ్‌ను కాపాడుకోవడమే నా ముందున్న లక్ష్యం. అందులో భాగంగానే అటు అందానికీ, ఇటు అభినయానికీ ఆస్కారమున్న పాత్రని 'పరమవీరచక్ర'లో చేశా' అని తెలిపింది షీలా. దానికి తోడు బికినీలు వేయడానికి ఇంకా సమయం ఉంది. ఇప్పుడిప్పుడే ప్రేక్షకుల తనను ఇష్టపడుతున్నారు కాబట్టి ఆ ఇమేజ్ ని నేను పాడు చేసుకోదలుచుకోలేదు. ఒక్కసారి బికిని వేస్తే అది సక్సస్ కావచ్చు లేదా కెరీరే పాడవచ్చు, అందుకే మంచి సినిమాలు తీసి నన్ను నేను ప్రువ్ చేసుకొన్నాలకా ఆలోచిస్తా అంటోంది షీలా. దానికోసం కేవలం కథలు వినడమే కాకుండా, రిలీజవుతున్న సినిమాలన్నింటినీ మిస్పవకుండా చూస్తున్నదామె. 'నేను ఇంట్లో ఉంటే మా అమ్మకి చేతినిండా పనే. నేనూ, తమ్ముడూ ఇల్లుపీకి పందిరేస్తుంటాం. అవన్నీ సర్దుకోలేక అమ్మ అలసిపోతుంటుంది' అని సరదాగా నవ్వేస్తుంది ఈ ఇరవై ఒక్కేళ్ల ముద్దుగుమ్మ.


Click it and Unblock the Notifications











