»   » ప్రియుడితో నయనతార....ఇంకా కొన్నాళ్లు ఎంజాయ్ చేశాకే...?

ప్రియుడితో నయనతార....ఇంకా కొన్నాళ్లు ఎంజాయ్ చేశాకే...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ బ్యూటీ నయనతార ప్రభుదేవాతో విడిపోయిన తర్వాత కొంత కాలం ఒంటరిగా ఉన్నా... తర్వాత తనకంటూ ఓ తోడు వెతుక్కుంది. దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం నడుపుతోంది. కొంతకాలంగా తన ప్రియుడితో కలిసి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తోంది.

ఓనమ్, పొంగల్ పండగ సాక్షిగా.... ఇద్దరూ ప్రేమలో ఉన్నారని అఫీషియల్‌గా ఖరారైంది. గతేడాది ఓనమ్ పండగ సమయంలో రెండు మూడు రోజుల పాటు కేరళలోని నయనతార ఇంట్లోనే గడిపాడు విఘ్నేష్. తర్వాత పొంగల్ ఫెస్టివల్‌ను ప్రియురాలితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు.

పెళ్లి విషయంలో ట్విస్ట్

పెళ్లి విషయంలో ట్విస్ట్

వీరి ప్రేమాయణం మొదలై దాదాపు రెండేళ్లు గడిచిపోయింది. ముచ్చటగా మూడో ఏడాది కూడా ఎలాంటి బ్రేకప్ లేకుండా సక్సెస్‌ఫుల్‌గా వీరి లవ్ ఎఫైర్ రన్ అవుతోంది. త్వరలోనే ఇద్దరూ ఓ ఇంటివారు కాబోతున్నారని, పెళ్లి భాజాలు మ్రోగబోతున్నాయని అంతా అనుకుంటున్న తరుణంలో.... ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.

ఇంకొన్నాళ్లు ఎంజాయ్ చేశాకే

ఇంకొన్నాళ్లు ఎంజాయ్ చేశాకే

ఇటీవల ఓ ప్రెస్ మీట్లో పెళ్లి విషయమై విఘ్నేష్‌ను ప్రశ్నించగా.... ఆయన కళ్లలో ఏదో తెలియని గ్లో కనిపించింది. ఈ ప్రశ్నకు స్పందిస్తూ ప్రస్తుతం తన ఫోకస్ అంతా కెరీర్ మీదనే ఉందని, పెళ్లి ఆలోచన ఇప్పుడే లేదని తేల్చిచెప్పాడు. ఇలా చెప్పడం ద్వారా.... అప్పుడే పెళ్లి అనే ఊబిలో పడకుండా ఇంకా కొంతకాలం తాము జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం అని చెప్పకనే చెప్పాడు విఘ్నేష్.

సహజీవనం

సహజీవనం

మూడు ముళ్లు పడలేదు అనే మాటేగానీ.... ఇద్దరి మధ్య దాదాపు అన్ని ముచ్చట్లు తీరిపోయాయని, ఇద్దరికీ షూటింగులు లేనపుడు కలిసి ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారని, సీక్రెట్‌గా హాలిడే ట్రిప్పులు ఎంజాయ్ చేస్తున్నారని తమిళ మీడియాలో బోలెడు గాసిప్స్.

నిజమే అనేలా సంకేతాలు

నిజమే అనేలా సంకేతాలు

తమ గురించి మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఏనాడూ ఈ ప్రేమ జంట ఖండించలేదు. బాధ పడలేదు..... అదంతా నిజమే కాబట్టి వీరు సైలెంటుగా ఉంటున్నారని, అయినా ఈ రోజుల్లో పెళ్లికి ముందే అవన్నీ సర్వసాధారణమైన విషయాలేననే వాదన వినిపిస్తోంది.

English summary
Media people question about his girlfriend Nayanthara, Vignesh’s eyes glow. When asked him if he has plans to get married to Nayanthara in the near future, he replied, “As of now, my priority is on my work and career.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu