బ్యూటీ క్వీన్ నేహా ధూపియా ఈ మధ్యన 'సింగ్ ఈజ్ కింగ్' సినిమాలో మాఫియా డాన్ అనుచరురాలి పాత్ర చేసింది. అందులో అవసరాన్ని బట్టి యాక్షన్ సీక్వెన్స్ కూడా చేసి అదరకొట్టింది. అయితే ఆమెకు కొత్త బెంగ పట్టుకుంది. జూలీ వంటి బోల్డ్ చిత్రాల ద్వారా సంపాదించుకున్న సెక్సీ సింబల్ ని ఇటువంటి పాత్రలు నాసనం చేస్తున్నాయని అంటోది. అందులోనూ ఈ మధ్య వరసగా చుప్ చుప్ కే,డిల్లీ హైట్స్, మిథ్య ,షూట్ ఎట్ లోకండ్ వాలా వంటి చిత్రాలలో సీరియస్ గా చేసింది. దాంతో ఆమెకు అంతా ఆ తరహా పాత్రలనే ఆఫర్ చేస్తున్నారుట. అయితే సెక్సీ స్టార్ గా అయితే రెమ్యునేషన్ బాగుంటుందని,మల్లికా షెరావత్ లా ఎదగవచ్చని ఆలోచనట. ఈ మధ్యనే 28లోకి ఎంటవరటం మరో రకంగా కంగారు పుట్టిస్తోందని,అందుకే ఇప్పటికైనా సెటిల్ అవ్వాలని దానికి అదే మార్గమని భావిస్తోందిట.
Story first published: Thursday, July 16, 2026, 23:44 [IST]