మహేష్ నిర్మాతలతో మెగాస్టార్ చిరంజీవి బిగ్ బడ్జెట్ మూవీ?

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా సొంత ప్రొడక్షన్ లోనే వరుసగా సినిమాలు చేశారు. రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్ లో ఖైదీ నెంబర్ 150 సినిమా అలాగే సైరా సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మెగాస్టార్ తన ట్రాక్ ని మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

బయట నిర్మాతలతో కూడా సినిమాలు చేయాలని అడుగులు వేస్తున్న మెగాస్టార్ నెక్స్ట్ రెండు స్క్రిప్ట్ లను రెడీ చేయిస్తున్నాడు. ప్రస్తుతం ఆచార్య సినిమా సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాను కూడా రామ్ చరణే నిర్మిస్తున్నాడు. అయితే ఆ సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి మహేష్ బాబు నిర్మాతలతో కలవనున్నట్లు తెలుస్తోంది.

Mythri movie makers big budget movie planning with megastar

శ్రీమంతుడు సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ ప్రస్తుతం మహేష్ తో మరో సినిమాను రూపొందిస్తోంది. సర్కారు వారి పాట అనే ఆ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక మెగాస్టార్ తో మైత్రి వారు నిర్మియించబోయే సినిమాకు వెంకీ మామా డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే బాబీ, మెగాస్టార్ మధ్య కథ చర్చలు నడిచాయి. మెగాస్టార్ ఆ కథపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. ఇక బాబీ పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయాల్సి ఉంది. మరోసారి స్టోరీ సిట్టింగ్ జరిగితే నిర్మాతలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని మెగాస్టార్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి మెగాస్టార్ ప్రాజెక్టును మైత్రి మూవీ మేకర్స్ ఏ స్థాయిలో నిర్మిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X