twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘వినయ విధేయ రామ’ ఎఫెక్ట్... బోయపాటికి మరో చేదు అనుభవం?

    |

    రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన 'వినయ విధేయ రామ' బాక్సాఫీసు వద్ద పరాజయం చవి చూసిన సంగతి తెలిసిందే. సినిమా రంగంలో జయపజయాలు సర్వసాధారణమే అయినా 'వినయ విధేయ రామ' పరాజయం మాత్రం బోయపాటి కెరీర్ మీద తీవ్ర ప్రభావం చూపింది. కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఈ మాస్ డైరెక్టర్ ఈ సారి ఊహించని పరిణామాలు ఎదుర్కొంటున్నారు.

    మొన్నటి వరకు బోయపాటితో సినిమాలు చేయడానికి ఆసక్తిగా ఉన్నపలువురు స్టార్ హీరోలు, బడా నిర్మాణ సంస్థలు ఇపుడు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు నిర్మాతలు బోయపాటికి ఇచ్చిన అడ్వాన్సులు కూడా వెనక్కి తీసుకుంటున్నారట.

    బోయపాటితో మైత్రి మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ లేనట్లేనా?

    బోయపాటితో మైత్రి మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ లేనట్లేనా?

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస విజయాలు, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ నమోదు చేస్తూ దూసుకెళుతున్న మైత్రి మూవీ మేకర్స్ వారు గతంలో బోయపాటితో సినిమా చేయడానికి అడ్వాన్స్ ఇచ్చారట. వినయ విధేయ రామ తర్వాత వారు తమ నిర్ణయం మార్చుకున్నారని, అడ్వాన్స్ వెనక్కి తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

    ఇలాంటి పరిస్థితికి కారణం ఏమిటి?

    ఇలాంటి పరిస్థితికి కారణం ఏమిటి?

    బోయపాటి ఇంత దారుణమైన పరిస్థితి ఎదుర్కోవడానికి కారణం ‘వినయ విధేయ రామ' చిత్రానికి భారీ బడ్జెట్ ఖర్చు పెట్టించడం, అంత ఖర్చు పెట్టి కూడా కొన్ని సీన్లు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేని విధంగా చాలా ఓవర్‌గా చిత్రీకరించడమే అని తెలుస్తోంది. ‘వినయ విధేయ రామ' తర్వాత బోయపాటిపై సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.

    నిర్మాతతో విబేధాలు

    నిర్మాతతో విబేధాలు

    ‘వినయ విధేయ రామ' సినిమా విడుదల తర్వాత నిర్మాతతో బోయపాటికి విబేధాలు వచ్చినట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు పరిహారం చెల్లించే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు టాక్.

    బాలయ్యతో అవకాశం... కసిగా ఉన్న బోయపాటి

    బాలయ్యతో అవకాశం... కసిగా ఉన్న బోయపాటి

    అలా అని బోయపాటికి అన్ని దారులు మూసుకుపోయిన పరిస్థితి ఏమీ లేదు. తనకు సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ విజయాలు అందించిన బోయపాటికి ఆపన్నహస్తం అందించారు బాలయ్య. తర్వలో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతోంది. బాలయ్యతో చేసే సినిమాతో ఎలా గైనా పెద్ద హిట్ కొట్టి తన బ్రాండ్ ఇమేజ్ నిలబెట్టుకోవాలనే కసితో బోయపాటి ఉన్నారట.

    English summary
    Mythri Movie Makers paid Boyapati a hefty sum as advance when they entered the Telugu film industry. After Vinaya Vidheya Rama Failure, Mythri decided to call off the project.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X