For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పుష్ప 2 కోసం ప్రయత్నాలు.. వాళ్ళందరితో టచ్ లోకి నిర్మాతలు!

  |

  సుకుమార్ ద‌ర్శ‌కత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తోన్న పాన్ ఇండియా మూవీ పుష్ప‌. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ మూవీ టీజ‌ర్ ఇప్పటికే ఉన్న అంచనాలను మ‌రింత పెంచేసి హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో అల్లుఅర్జున్ లారీ డ్రైవ‌ర్‌గా క‌నిపించ‌నుండ‌గా, ఆయ‌న‌కు హీరోయిన్ గా ర‌ష్మిక మంద‌న్నా న‌టిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

  బన్నీ రెడీ

  బన్నీ రెడీ

  అల్లు అర్జున్ గతేడాది `అల వైకుంఠపురములో` సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై అనూహ్యమైన సూపర్ హిట్ గా సాధించింది. ఇక అదే సమయంలో వచ్చిన మహేష్‌ బాబు `సరిలేరు నీకెవ్వరు` సినిమాకి ఈ సినిమాకి మధ్య అన్ని విషయాల్లో పోటీ కూడా నెలకొంది.

  అన్నింటా సస్పెన్స్

  అన్నింటా సస్పెన్స్

  అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ తనకు `ఆర్య`, `ఆర్య 2` లాంటి హిట్స్ ఇచ్చన సుకుమార్‌ దర్శకత్వంలో `పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. ఈ పుష్ప సినిమా రెండు భాగాలుగా వస్తుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటన రానప్పటికీ పెద్ద ఎత్తున ప్రచారం మాత్రం జరుగుతూనే ఉంది. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందా రాదా అనే విషయం మీద మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది.

  ప్లాన్ అదే

  ప్లాన్ అదే

  నిజానికి ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. ఆగస్ట్ 13కి విడుదల చేయాలనేది సినిమా యూనిట్‌ ప్లాన్‌. కానీ అనుకోకుండా వచ్చి పడిన సెకండ్ వేవ్ దెబ్బకు షూటింగ్‌ ఆగిపోయింది. ఏకంగా బన్నీకి కూడా కరోనా సోకడంతో ఆయన ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉండి రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఓ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. `పుష్ప` సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయాలని యూనిట్ ప్లాన్‌ చేస్తోందని ఒక వారంగా ప్రచారం జరుగుతోంది.

  రెండు భాగాలుగా

  రెండు భాగాలుగా

  పుష్ప రెండు విడతలుగా విడుదల చేయనున్నట్లు దాదాపు ఖరారు అయినట్టేనని అంటున్నారు. మొదటి భాగం ఈ అక్టోబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉండగా, సీక్వెల్ మాత్రం వచ్చే ఏడాది చివర్లో థియేటర్లలోకి రానుందట. ఇక అల్లు అర్జున్ ఇప్పటికే పుష్ప రెండో పార్ట్ కోసం తన డేట్స్ కూడా కేటాయించారని అంటున్నారు.

  వాళ్ళ డేట్స్ కోసం ప్రయత్నాలు

  వాళ్ళ డేట్స్ కోసం ప్రయత్నాలు


  ఈ ఏడాది చివరి నాటికి యూనిట్ రెండో పార్ట్ షూట్ ప్రారంభం అవుతుందని, వచ్చే వేసవి నాటికి రెండో పార్ట్ షూటింగ్ పూర్తి చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ క్రమంలోనే అందుకు అనుగుణంగా అల్లు అర్జున్ ప్రాజెక్ట్ కోసం తన డేట్స్ కేటాయించారని అంటున్నారు. ఇక అల్లు అర్జున్ డేట్స్ ఇవ్వడంతో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు రష్మిక మందన్న అలానే ఫహద్ ఫాసిల్ తో ఇప్పటికే చర్చలు ప్రారంభించారని అంటున్నారు.

  Pushpa రెండు భాగాలు గా వర్కౌట్ అవుతుందా.. బన్నీ, Sukumar తర్జన భర్జన || Filmibeat Telugu
  స్పెషల్ సాంగ్

  స్పెషల్ సాంగ్


  ఈ సినిమాలో హీరోయిన్ ఐశ్వ‌ర్యా రాజేష్ న‌టించ‌నున్న‌ట్లు ప్రచారం జరుగుతోంది. పుష్ప‌రాజ్ కు చెల్లెలుగా ఐశ్వ‌ర్యా క‌నిపించ‌నున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ న‌టి ఊశ్వరిరౌటేలా ఓ స్పెష‌ల్ సాంగ్ చేయ‌నుందని అంటున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. ‌


  English summary
  From some days there are some speculations that Pushpa will be releasing in two instalments. While the first part is likely to release this October, the sequel will be out in theatres later next year. Apparently, Allu Arjun has already allotted his dates for Pushpa’s second instalment. so Mythri Movie Makers have already initiated talks with Rashmika Mandanna and Fahadh Faisal regarding their dates and availability.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X