చిరు, పవన్, బన్నీ.. 300కోట్లకు పైగా పెట్టుబడి, ఆ ప్రొడక్షన్ టీమ్ ఎలా తట్టుకుంటుందో?
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల డేట్స్ దొరికితే చాలు పంట పడినట్లే అనే విషయంలో మార్పులు చాలానే వచ్చాయి. ఎందుకంటే కరోనా ఆ ఆలోచనలను కొంత మార్చేస్తున్నాయనే చెప్పాలి. ప్రస్తుతం తీసుకున్న కమిట్మెంట్ ప్రకారం సినిమాలను ఎలా పూర్తి చేయాలి అనే సందిగ్ధంలో చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ ముగ్గురు హీరోలపై పెట్టుబడులు గట్టిగానే పెట్టనుంది. ఈ కరోనా కష్టకాలంలో వారి సినిమాలను పూర్తి చేయాలంటే చాలా రిస్క్ తో కూడుకున్న పని.

అంధరికంటే ఎక్కువగా..
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నిర్మాతలు కూడా భవిష్యత్తుపై నమ్మకంతోనే రిస్క్ చేస్తున్నారు. ఎలాగైనా పరిస్థితులు చక్కబడతాయనే కాన్ఫిడెన్స్ తో స్టార్ హీరోలకు అడ్వాన్స్ లు ఇచ్చి కూర్చున్నారు. దర్శకులకు కూడా ముందే కొంత డబ్బు ఇచ్చి స్క్రిప్ట్ పనులతో బిజీగా మారారు. ఇక ఈ లాక్ డౌన్ లో మైత్రి మూవీ మేకర్స్ ఒక విధంగా అంధరికంటే ఎక్కువగానే ఖర్చు చేస్తుందనే చెప్పాలి.

రంగస్థలం తరువాత..
మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ ఆ తరువాత కొరటాల శివతో వరుసగా సినిమాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకుంది. ఇక రంగస్థలం సినిమా తరువాత వారి రేంజ్ మరింత ఒరేగడంతో ఏకంగా పాన్ ఇండియా కథలపై ఫోకస్ పెట్టారు.

బన్నీ కోసం 150కోట్లు..
నెక్స్ట్ ముగ్గురి మెగా హీరోలపై మైత్రి సంస్థ మూడు వందల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టడానికి రెడీ అయ్యింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప సినిమాను సెట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొంత షూటింగ్ ని కూడా పూర్తి చేశారు. ఆ సినిమా కోసం 150కోట్ల వరకు ఖర్చు చేసే ఛాన్స్ ఉంది.

గబ్బర్ సింగ్ కాంబినేషన్ కోసం..
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేయనున్న సినిమా కూడా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లోనే రూపొందనుంది. ఈ సినిమా కోసం 80 కోట్లకు పైగా ఖర్చు చేసే అవకాశం లేకపోలేదు. 100కోట్లు కూడా ఖర్చు చేయవచ్చనే టాక్ వస్తోంది. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ కాంబినేషన్ క్రేజ్ పై నమ్మకంతో ఎంతైనా ఖర్చు చేయడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు.
Recommended Video

మెగాస్టార్ తో కలిపి..350కోట్లు..
ఇక మెగాస్టార్ చిరంజీవితో కూడా ఒక సినిమాను తెరకెక్కించాలని అనుకుంటున్నారు. బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ ఒక సినిమా చేయాలని చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కోసం కూడా మైత్రి మూవీస్ 100కోట్లకు తక్కువకాకుండా ఖర్చు చేసే ఛాన్స్ ఉంది. ఈ విధంగా ఈ బిగ్ ప్రొడక్షన్ హౌజ్ దాదాపు 350కోట్లను మెగా హీరోలపై పెట్టుబడి పెట్టబోతోందన్నమాట.


Click it and Unblock the Notifications











