బడా తమిళ హీరోలపై ఫోకస్ చేసిన మైత్రి మూవీ మేకర్స్.. దిల్ రాజు కంటే హై లెవెల్ కాంబినేషన్స్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు తన స్థాయిని పెంచుకునే విధంగా మరింత పెద్ద సినిమాలను నిర్మించాలని అనుకుంటుంది. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్లోనే పుష్ప 2 పాన్ ఇండియా సినిమాతో పాటు మరికొన్ని బిగ్ బడ్జెట్ హీరోల సినిమాలు కూడా రూపొందుతున్నాయి. ఇటీవల మైత్రి సంక్రాంతికి ఒకేసారి రెండు పెద్ద సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. వాల్తేరు వీరయ్య తో పాటు వీరసింహారెడ్డి సినిమాలను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ రెండు సినిమాలతోను బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది.
ఇక పోటీగా వచ్చిన దిల్ రాజు వారసుడు సినిమా మాత్రం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. అయితే దిల్ రాజు ఇప్పుడు పక్కా ఇండస్ట్రీలోని అగ్ర హీరోలతో కూడా సినిమాలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ కూడా అంతకుమించి అనేలా అగ్ర హీరోలను ఫిక్స్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ తో కూడా ఒక సినిమా చేయాలని అనుకుంటున్నారు. అలాగే తమిళంలో దాదాపు విజయ్ తో మంచి క్రేజ్ అందుకుంటున్న అజిత్ డేట్స్ కూడా తీసుకోవాలి అని ఈ ప్రముఖ సంస్థ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

అంతేకాకుండా తమిళం ఇండస్ట్రీలో నే కాకుండా ఇప్పుడు తెలుగులో కూడా మంచి గుర్తింపు అందుకుంటున్న శివ కార్తికేయన్ తో కూడా ఒక ప్రాజెక్టును ఫైనల్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం అజిత్ శివ కార్తికేయన్ ఇద్దరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేయాలి అని గత కొన్ని వారాలుగా ఈ నిర్మాతలు వారి మేనేజర్స్ తో చర్చలు జరుపుతోంది. త్వరగా వారికి అడ్వాన్స్ ఇచ్చి ప్రాజెక్టులకు కూడా ఫైనల్ చేయాలి అని అనుకుంటున్నారు. అయితే వారు తెలుగు దర్శకులతోనే ఆ తమిళ హీరోలతో సినిమాలను తెరపైకి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మరి వారి ప్రణాళికలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











