మెగాస్టార్ సినిమాలో విలన్ గా మలయాళ స్టార్.. తమిళ నటుడు హ్యాండ్ ఇవ్వడంతో?
సినీరంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమా చేసి తమ సత్తా ఏమాత్రం తగ్గలేదు అని నిరూపించుకున్నారు. ఇక ఆ తర్వాత వచ్చిన సైరా సినిమా సైతం ప్రేక్షకులలో మంచి స్పందన తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు ప్రకటిస్తూ ఏమాత్రం ఖాళీ లేకుండా సినిమా షూటింగ్లో పాల్గొంటూ ముందుకు వెళుతున్నారు. చిరంజీవి ఇటీవలే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ ఒక కీలక పాత్రలో నటించడంతో అటు మెగా అభిమానులతో పాటు తెలుగు సినీ అభిమానులలలో కూడా సినిమా మీద విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి.
దానికి అనుగుణంగా ఈ సినిమాలో విలన్గా సోనూసూద్ నటించగా హీరోయిన్గా పూజ హెగ్డే నటించింది. ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. అయినా సరే ఫలితంతో ఏ మాత్రం సంబంధం లేకుండా మెగాస్టార్ చిరంజీవి భార్యతో కలిసి అమెరికా వెకేషన్ కు వెళ్లి వచ్చి మళ్ళీ షూటింగ్ లో బిజీ అవుహ్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్, మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం సినిమా రీమేక్ అయిన భోళా శంకర్ సినిమా చేస్తున్నారు. అలాగే దర్శకుడు బాబీ డైరెక్షన్ లో వాల్తేర్ వీరయ్య అనే సినిమా కూడా చేస్తున్నారు. ఈ సినిమా కోసం స్టార్ క్యాస్ట్ ను సిద్దం చేస్తున్నారు.

మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుండగా, కోలీవుడ్ నటుడు బాబీ సింహా మరో ముఖ్య పాత్ర పోషించనున్నారు. ఇక విలన్ గా సముద్రఖనిని అనుకున్నారు కానీ ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసే పనిలో పడడంతో ఆయనకు బదులుగా మరో నటుడిని రంగంలోకి దింపాలనుకుంటున్నారు. ఆయన మరెవరో కాదు.. బిజు మీనన్. మలయాళంలో ఆయన చేసిన అయ్యప్పనుమ్ కోషియం సూపర్ హిట్ అయింది. తెలుగులో కూడా 'ఖతర్నాక్', 'రణం' వంటి సినిమాలు చేశారు. చిరు సినిమాతో బిజు మీనన్ ను టాలీవుడ్ కి మళ్లీ తీసుకురావాలనుకుంటున్నారని అంటున్నారు. చిరు సినిమాలో బిజు మీనన్ ను విలన్ గా తీసుకోవాలని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భావిస్తోందని టాక్. ఇందులో నిజానిజాలు ఏమేరకు ఉన్నాయనేది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











