మరోసారి వెండితెరపై రొమాన్స్ చేయబోతున్న ఉప్పెన జోడీ?
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ కాంబినేషన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒకప్పుడు కాంబినేషన్స్ కు భారీ స్థాయిలో రెస్పాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు అనుకున్నంత రేంజ్ లో లేదు. అయితే సరైన కథతో వస్తే తప్పకుండా వర్కౌట్ అవుతుందని కొంతమంది నిర్మాతలు చాలా బలంగా నమ్ముతారు. ఇటీవల ఉప్పెన జోడి బాక్సాఫీస్ వద్ద మొదటి హిట్టు కొట్టిన విషయం తెలిసిందే.
వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ఉప్పెన కథకు తగ్గట్లు సరైన కెమిస్ట్రీతో అభిమానులను ఎంతగానో ఎట్రాక్ట్ చేశారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో లాభాలను అందించింది. దీంతో నిర్మాతలు దర్శకుడు బుచ్చిబాబుతోనే మరో సినిమా చేయబోతున్నారు. అలాగే హీరో హీరోయిన్ ఇద్దరిని కూడా మరొకసారి రిపీట్ చేయాలని చూస్తున్నారు. వీరి కోసం కథలను కూడా వింటున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రెండు కథలపై చర్చలు జరిపిన నిర్మాతలు అందులో ఒక దాన్ని ఫైనల్ చేసి ఉప్పెన జోడిని ఫిక్స్ చేయాలని చేస్తున్నారట. దర్శకుడు ఎవరనే విషయం ఇంకా బయటకు రాలేదు. కానీ త్వరలోనే ఉప్పెన జోడితో మాత్రం మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని తెరకెక్కించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కృతి శెట్టి.. రామ్, నాని వంటి టాలెంటెడ్ హీరోలతో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక వైష్ణవ్ రీసెంట్ గా గిరిశయతో ఒక కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. ఇక త్వరలోనే క్రిష్ దర్శకత్వంలో చేసిన సినిమా థియేటర్స్ లోకి రానుంది.


Click it and Unblock the Notifications











