Pushpa 2 Tickets: పుష్ప మూవీ మేకర్స్ మాస్టర్ ప్లాన్ .. అలా చేస్తే బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ పక్కా..
Pushpa 2 Tickets: ప్రస్తుతం ఎక్కడ చూసినా 'పుష్ప 2' ట్రెండ్ నడుస్తోంది. పుష్ప రాజ్ హావా కొనసాగుతోంది. ఇటు ఇండస్ట్రీలో.. అటు సోషల్ మీడియాలో పుష్ప గాడి జోరు కొనసాగుతోంది. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో రూపుదిద్దుకున్న పుష్ప 2 సినిమా కోసం కేవలం బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా మూవీ లవర్స్ కూడా ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో పుష్ప 2 పై అంచనాలను పెంచడానికి పుష్ప 2 ట్రైలర్ రీలిజ్ ఈవెంట్ ను పాట్నాలో గ్రాండ్ గా నిర్వహించారు. దీంతో మూవీపై ఊహించని బజ్ క్రియేట్ అయింది. దీనిని క్యాష్ చేసుకోవడానికి మూవీ మేకర్స్ కొత్త ప్లాన్ వేస్తున్నారట. పుష్ప 2 మూవీ టికెట్స్ ను వినూత్నంగా అమ్మాలని భావిస్తున్నారట. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటీ ?
ఇండియా మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2'. ఈ మూవీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించారు. అలాగే.. మాలీవుడ్ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్రలో ఈ సినిమాలో నటిస్తున్నారు. ఆయన మరోసారి భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో కనిపించనున్నారు. ఇక సునీల్, అనసూయ భరద్వాజ్, డాలీ ధనుంజయ, అజయ్ తదితరులు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సాంగ్స్ కంపోజ్ చేశారు. డీఎస్పీతో పాటు తమన్ నేపథ్య సంగీతం అందించారు.

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో రూపుదిద్దుకున్న పుష్పట్టు సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూవీ కి సంబంధించిన పోస్టర్స్, గ్లిమ్స్, లీక్స్ వంటివి పుష్ప 2 మూవీ పై భారీ హైప్స్ ను క్రియేట్ చేశాయి. ఈ తరుణంలో మూవీపై మరింత అంచనాలను పెంచేలా.. నిన్న బీహార్ లోని పాట్నాలో పుష్ప 2 మూవీకి సంబంధించిన ట్రైలర్ గ్రాండ్ గా నిర్వహించారు. లక్షలాది అభిమానుల మధ్య విడుదలైన ఈ ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఈ ట్రైలర్ విడుదలైన 20 గంటలలో దాదాపు 45 మిలియన్ వ్యూస్ ను సాధించింది. గతంలో ఇతర సినిమాలు సాధించిన రికార్డును బ్రేక్ చేసింది. ఇలా ట్రైలర్ కు ఊహించని రెస్పాన్స్ రావడంతో పుష్ప రాజ్ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
అయితే.. ఈ బజ్ ను క్యాష్ చేసుకోవాలని పుష్ప 2 మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా మైత్రి మూవీ మేకర్స్ ఓ వినూత్న ఆలోచనతో రాబోతున్నట్లు తెలుస్తోంది. అదేమిటంటే.. పుష్ప 2 విడుదలైన తొలిరోజు (డిసెంబర్ 5 న) ప్రతి థియేటర్లలో తొలి రోజు తొలి టికెట్ ను వేలం పద్ధతి ద్వారా అమ్మాలని భావిస్తున్నారట. ఈ సమయంలో ఎవరు ఎక్కువ ధరకు పాడుతారో..వారికి ఫస్ట్ టికెట్ ఇస్తార అన్నమాట. ఇలా ఏపీ, తెలంగాణలోని అన్ని థియేటర్లలో మొదటి టికెట్ ను వేలం పద్ధతి ద్వారా విక్రయించాలని భావిస్తున్నారట. ఈ సమాచారానంత ఆన్లైన్లో పొందుపరచబోతున్నట్లు తెలుస్తోంది. కానీ ప్రస్తుతం ఇది కేవలం ప్రతిపాదనలో ఉన్న ఆలోచన మాత్రమే. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఒకవేళ ఈ ప్లాన్ సక్సెస్ అయితే మాత్రం పుష్ప తొలి రోజు కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద సునామి రావడం కన్ఫామ్ అంటున్నారు ఫ్యాన్స్. పుష్ప 1 విడుదల సమయంలో ఎలాంటి బజ్ లేకుండానే దాదాపు రూ. 400 కోట్ల కలెక్ట్ చేసింది. అలాంటి మూవీకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 కు ఎవరు ఊహించని బజ్ క్రియేట్ అయింది. ఎప్పుడెప్పుడా సినిమా విడుదలవుతుందా? అని వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ నిరీక్షిస్తున్నారు. అలాగే.. ఎప్పుడు ఫ్రీ బుకింగ్స్ పెడతారో.. ముందుగా బుక్ చేసుకుందామని మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఇలా అన్ ఎక్స్పెక్టెడ్ హైప్స్ క్రియేట్ కావడంతో ఇండస్ట్రీ పెద్దలు, మార్కెట్ వర్గాలు పుష్ప 2 మూవీ రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. కానీ, బన్నీ ఫ్యాన్స్ మాత్రం ఈసారి అల్లు అర్జున్ కు రూ. 2000 కోట్ల మార్కెట్ ను క్రియేట్ చేయాలని భావిస్తున్నారట. మరి పుష్ప రాజ్ ఏ విధంగా అట్రాక్ట్ చేస్తాడో.. బాక్సాఫీస్ వద్ద పుష్ప రాజ్ రూలింగ్ ఎలా చేస్తాడో.. వేచిచూడాలి.


Click it and Unblock the Notifications











