ప్లానింగ్ మామూలుగా లేదు.. అదిరిపోయే కాంబోతో కోలీవుడ్‌లోకి మైత్రీ మూవీస్!

ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ ప్రొడక్షన్ కంపెనీ, బ్యానర్ ఏదైనా ఉందా? అంటే అది కేవలం మైత్రీ మూవీస్. అతి తక్కువ కాలంలోనే మైత్రీ మూవీస్ టాప్ బ్యానర్‌గా తనకంటూ ఓ ముద్రను వేసుకుంది. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ హిట్లను కొట్టేసింది. అలా మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి వారితో మైత్రీ మూవీస్ సినిమాలు తీసి ఇండస్ట్రీ హిట్లను కొట్టేసింది.

పెద్ద చిత్రాలు..

పెద్ద చిత్రాలు..

మైత్రీ మూవీస్ బ్యానర్‌లొ కాంబో సెట్ అయిందంటే దాదాపు అది హిట్ అయినట్టే. అయితే వీరు నిర్మించే పెద్ద సినిమాలు ఇండస్ట్రీ హిట్లను కొడితే.. చిన్న హీరోలతో తెరకెక్కించే సినిమాలు మాత్రం కనీసం యావరేజ్ టాక్ కూడా తెచ్చుకోలేకపోయాయి. అలా వీరికి స్టార్ హీరోలే కలిసి వచ్చారు.

టాప్ స్టార్లందరితో..

టాప్ స్టార్లందరితో..

టాలీవుడ్ టాప్ స్టార్లందరితోనూ మైత్రీ మూవీస్ సినిమాలు నిర్మిస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి వారితో సినిమాలు తీసేసింది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి వారితోనూ ప్రాజెక్ట్‌లు చేసేస్తోంది. అయితే మైత్రీ మూవీస్ మాత్రం తన హద్దులను చెరిపేసేందుకు పాటు పడుతోంది.

 బాలీవుడ్ ప్రయత్నాలు..

బాలీవుడ్ ప్రయత్నాలు..

మైత్రీ మూవీస్ బాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండతో హీరో అనే సినిమాను మైత్రీ మూవీస్ ఓకే చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై అప్పట్లో రకరకాల రూమర్లు వినిపించాయి. తాజాగా మైత్రీ మూవీస్ కోలీవుడ్‌లోనూ పాగా వేయాలని ప్రయత్నిస్తోన్నట్టు టాక్.

Recommended Video

SSMB 27 : Mahesh Babu’s Next Sarkar Vaari Paata To Be Announced In May 31
కోలీవుడ్ ఎంట్రీ..

కోలీవుడ్ ఎంట్రీ..

మైత్రీ మూవీస్ కోలీవుడ్ ఎంట్రీకి మంచిప్లాన్ వేస్తోన్నట్టు తెలుస్తోంది. దళపతి విజయ్‌తో ఓ భారీ చిత్రాన్ని నిర్మించేందుకు మైత్రి పావులు కదుపుతోందట. మళ్లీ విజయ్ లోకేష్ కనకరాజ్ కాంబోలోనే మరో సినిమా రాబోతోందట. ఈ మూవీని మైత్రి ద్విభాష చిత్రంగా తెరకెక్కించాలని చూస్తోందట. మరి మైత్రి ఆలోచనలు ఫలిస్తాయో లేదో చూడాలి.

 మాస్టర్ కలెక్షన్లు..

మాస్టర్ కలెక్షన్లు..

లోకేష్ కనకరాజ్ విజయ్ కాంబోలో వచ్చిన మాస్టర్ కలెక్షన్లలో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. కరోనా లాంటి పరిస్థితుల్లోనూ దాదాపు 250 కోట్లు కొల్లగొట్టేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 25 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X