తేజ వెయ్యి అబద్దాల్లో... మాజీ గవర్నర్ తివారీ రాసలీలల సీన్?
సమకాలిన అంశాలతో రూపొందుతోన్న ఈ చిత్రంలో పలు రియల్ సంఘటనలను కూడా ప్రస్తావించనున్నారట. గతంలో మన రాష్ట్ర గవర్నర్‌గా పని చేసిన ఎన్.డి తివారీ సెక్స్ స్కాంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ అంశానికి సంబంధించిన సీన్‌ను సినిమాలో చూపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రమణ గోగుల స్వరాలిందిస్తున్న ఈ చిత్రంషూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ''వినోదాత్మకంగా సాగే కథ ఇది. హీరో పాత్రలో వైవిధ్యం కనిపిస్తుంది' అని చిత్ర వర్గాలు వెల్లడించాయి. తేజ మాట్లాడుతూ- ''పెళ్లంటే నూరేళ్ల పంట. నూరేళ్ల పంటను పండించడానికి '1000 అబద్ధాలు' అడితే తప్పుకాదు అని మన పెద్దలే చెప్పారు. ఒకరు ఆ మాటనే ఆదర్శంగా తీసుకున్నారు. 1000 అబద్ధాలతో అనుకున్న వ్యక్తిని పెళ్లాడి తమ కలను సాకారం చేసుకున్నారు. ఇంతకీ ఇన్ని అబద్దాలు అడింది అమ్మాయా? అబ్బాయా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అసలు ఇంతటి కఠోరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం సదరు వ్యక్తికి ఎందుకొచ్చింది? అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం'' అని చెప్పారు.
ఎస్తర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, నరేష్, చలపతిరావు, బాబూమోహన్, గౌతంరాజు, తిరుపతి ప్రకాష్, కొండవలస, హేమ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: మరుధూరి రాజా, సంగీతం: రమణగోగుల, కెమెరా: రసూల్ ఎల్లోర్, కళ: నరసింహవర్మ, ఎడిటింగ్: శంకర్, పాటలు: అరిశెట్టి సాయి, పోతుల రవికిరణ్. సమర్పణ: చిత్రం మూవీస్, నిర్మాణం: శ్రీప్రొడక్షన్స్.


Click it and Unblock the Notifications












