twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR అప్‌డేట్.. ఎన్టీఆర్ హీరోయిన్ కన్ఫర్మ్! ఎట్టకేలకు ఆ అమ్మాయే..

    |

    ఒకప్పటిలా లేదు లోకం.. టెక్నాలజీ బాగా విస్తరించడంతో ఏ క్షణానికి ఆ క్షణం తాజా అప్‌డేట్స్ కోరుకుంటున్నారు జనం. అందునా సోషల్ మీడియా బాగా విస్తృతమవడంతో ఓ చిన్న విషయమైనా ఇట్టే వైరల్ అవుతోంది. ఇక సినిమా సంగతులంటారా? వాటికి కొదవే లేదు. నెట్టింట ఎక్కడ చూసినా సినిమా ముచ్చట్లే. ఈ నేపథ్యంలో రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా సినిమా RRR లో ఎన్టీఆర్ హీరోయిన్ విషయమై మరో ఆసక్తికర విషయం వైరల్ అవుతోంది. ఆ విశేషాలు చూద్దామా..

    బాహుబలి తర్వాత భారీ మల్టీస్టారర్

    బాహుబలి తర్వాత భారీ మల్టీస్టారర్

    బాహుబలి లాంటి అపూర్వ విజయం తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ RRR. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో హై రేంజ్ టెక్నికల్ వాల్యూస్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. సినిమా మొదలు కాగానే నటీనటులకు సంబంధించిన అన్ని విషయాలు ప్రెస్‌మీట్ పెట్టి వెల్లడించారు జక్కన్న.

    RRR హీరోయిన్స్.. ఇంతలో అనుకోని పరిణామం

    RRR హీరోయిన్స్.. ఇంతలో అనుకోని పరిణామం

    RRRలో రామ్ చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన బ్రిటిష్ భామ డైసీ ఎడ్గార్ జోన్స్ నటించాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో రాజమౌళి మరో హీరోయిన్ కోసం వేట ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఇటీవలే హాలీవుడ్ బ్యూటీ ఎమ్మా రాబర్ట్స్‌ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.

    రాజమౌళి ప్లాన్ ఇదే..

    రాజమౌళి ప్లాన్ ఇదే..

    హాలీవుడ్ బ్యూటీ ఎమ్మా రాబర్ట్స్‌ విషయమై రాజమౌళి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అఫీషియల్ మెసేజ్ రానప్పటికీ.. మరికొద్ది రోజుల్లోనే ఎన్టీఆర్ హీరోయిన్ ఎవరనేది ఆయన ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. బ్రిటీష్ కాలం నాటి పరిస్థితులకు అనుగుణంగా ఎన్టీఆర్ కోసం తెల్లమ్మాయినే కన్ఫర్మ్ చేయనున్నారట జక్కన్న. అయితే ఆమె ఎవరు అనేది నెక్స్ట్ షెడ్యూల్‌కి అఫీషియల్ సమాచారం ఇవ్వనున్నారట.

    శరవేగంగా షూటింగ్.. బల్గేరియా పయనం

    శరవేగంగా షూటింగ్.. బల్గేరియా పయనం

    ప్రస్తుతం RRR షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బల్గేరియాలో తదుపరి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. ఈ మేరకు ఎన్టీఆర్, రామ్ చరణ్ సహా చిత్రయూనిట్ అంతా బల్గేరియా వెళ్లనున్నారు. అక్కడే భారీ యాక్షన్ సన్నివేశాలు షూట్ చేయనున్నారట. ఈ షెడ్యూల్ ప్రారంభానికి ముందే ఎన్టీఆర్ ఎవరనేది చెప్పాలని జక్కన్న ప్లాన్.

    RRR మూవీ

    RRR మూవీ

    1920 నాటి పరిస్థితుల నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో RRR మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీంగా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నాడు. డీవీవీ దానయ్య సమర్పణలో హై రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులై 30వ తేదీన విడుదల కానుంది.

    English summary
    RRR movie will going to start new schedule in Balgeria. The director Rajamouli intrested to take farien heroine with ntr role in the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X