ఎంటర్ కానున్న ఎన్టీఆర్, బాలకృష్ణ.. ఈగో ప్రాబ్లమ్స్!! నందమూరి అభిమానుల్లో ఉత్కంఠ

తెలుగు సినీ పరిశ్రమలో బాబాయ్- అబ్బాయ్ జోడీ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది ప్రేక్షకలోకం. అది పవన్ కళ్యాణ్- రామ్ చరణ్ రూపేనా కావొచ్చు.. బాలకృష్ణ- ఎన్టీఆర్ రూపేనా కావొచ్చు గానీ బా‌య్- అబ్బాయ్ జోడీని సిల్వర్ స్క్రీన్‌పై చూడాలని తహతహలాడుతుంటారు తెలుగు ప్రేక్షకులు. త్వరలోనే బాలకృష్ణ- ఎన్టీఆర్ రూపంలో అది నిజం కాబోతున్నట్లు తెలుస్తోంది. కాకపోతే వారిమధ్య ఈగో సమస్య ఉంటుందట. ఆ వివరాలేంటో చూద్దామా..

 నందమూరి ఫ్యాన్స్‌ పండగ చేసుకోవాల్సిందే..

నందమూరి ఫ్యాన్స్‌ పండగ చేసుకోవాల్సిందే..

నందమూరి అభిమానుల కల నెరవేరబోయే సమయం వచ్చిందని తెలుస్తోంది. నందమూరి నటసింహం బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి తెర పంచుకోబోతున్నారని టాక్ నడుస్తోంది. ఈ ఇద్దరితో భారీ మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేశారట మేకర్స్. ఈ న్యూస్ విని నందమూరి ఫ్యాన్స్‌ పండగ చేసుకోవాల్సిందే మరి.

మలయాళీ బ్లాక్‌బస్టర్ హిట్‌.. రీమేక్ రైట్స్

మలయాళీ బ్లాక్‌బస్టర్ హిట్‌.. రీమేక్ రైట్స్

‘అయ్యప్పనుమ్ కొశియుమ్' అనే మలయాళ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయబోతున్నారట. మలయాళంలో బిజు మీనన్, పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్స్‌‌లో నటించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌ అయింది. దీంతో ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగవంశీ సొంతం చేసుకున్నట్లు తెలిసింది.

బాలకృష్ణ ఫైనల్.. ఆయనతో ఎన్టీఆర్

బాలకృష్ణ ఫైనల్.. ఆయనతో ఎన్టీఆర్

ఈ సినిమాలో హీరోగా బాలకృష్ణను ఫైనల్ చేశారనేది లేటెస్ట్ టాక్. ఇక కథ ప్రకారం మరో హీరోకి ఛాన్స్ ఉన్నందున నందమూరి అభిమానులను ఖుషీ చేస్తూ, క్రేజ్ క్యాచ్ చేసుకునేలా ఎన్టీ‌ఆర్‌ని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఇద్దరు బలమైన వ్యక్తుల మధ్య ఈగో ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఉంటుందన్న కోణంలో ఈ చిత్రం రూపొందనుంది.

 ఈగో ప్రాబ్లమ్స్.. అదే మెయిన్

ఈగో ప్రాబ్లమ్స్.. అదే మెయిన్

కథ ప్రకారం ఇద్దరు వ్యక్తుల ఈగో ప్రాబ్లమ్స్ వారి వారి జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పుతాయనేది చూపించాలి. ఈ మూవీ తమిళ్ రీమేక్ కోసం ఇప్పటికే శరత్ కుమార్, శిశికుమార్‌ లను ఫైనల్ చేశారని సమాచారం. తెలుగులో మాత్రం బాలకృష్ణ, ఎన్టీఆర్ అనుకుంటున్నారట. సో.. చూడాలి మరి ఈ ఈగో జోలికి బాలయ్య, ఎన్టీఆర్ వెళతారా? లేదా? అనేది.

అటు ఎన్టీఆర్.. ఇటు బాలకృష్ణ

అటు ఎన్టీఆర్.. ఇటు బాలకృష్ణ

ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ RRR ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ వరకు ఫినిష్ కానున్నట్లు తెలిసింది. మరోవైపు బాలకృష్ణ- బోయపాటి సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కాబట్టి ఈ రెండు సినిమాలు ఫినిష్ అయితేనే ఎన్టీఆర్, బాలకృష్ణ ఈ మలయాళీ రీమేక్ సినిమా కోసం పనిచేసే ఛాన్సెస్ ఉన్నాయి.

Recommended Video

Jr NTR's Kid Bhargava Ram Grabing Attention In Social Media
 నందమూరి అభిమానుల్లో ఉత్కంఠ

నందమూరి అభిమానుల్లో ఉత్కంఠ

ఏదేమైనా బాబాయ్- అబ్బాయ్.. బాలకృష్ణ- ఎన్టీఆర్ ఒకేతెరపై కనిపించనున్నారనే వార్త బయటకు రావడం నందమూరి అభిమానుల్లో ఉత్కంఠ కలుగజేసింది. గతంలో 'జనతా గ్యారేజ్' సినిమాలో ఇలాగే బాలకృష్ణ- ఎన్టీఆర్ కలసి నటించనున్నాని వార్తలు వచ్చినప్పటికీ, చివరకు మోహన్ లాల్ తెరపై కనిపించారు. మరి ఈ సారి జరుగుతుందో చూద్దాం!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X