Just In
- 13 min ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 1 hr ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 1 hr ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
- 2 hrs ago
యాంకర్స్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
Don't Miss!
- Lifestyle
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- News
అయోధ్య రామ మందిరానికి రఘురామకృష్ణ రాజు విరాళం.. ఎంత మొత్తం అంటే..
- Finance
లవర్స్ డే గిఫ్ట్: ఐపీఓ మార్కెట్లోకి డేటింగ్ యాప్: పబ్లిక్ ఇష్యూ: కళ్లు చెదిరే ఆదాయం
- Automobiles
అప్పుడే అయిపోయాయ్.. సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టేశారు..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
తలపట్టుకుంటున్న నందమూరి వారసులు.. అన్నదమ్ములు డిస్టర్బ్.. కారణం అతనే!
నందమూరి వారసులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లకు ఊహించని చిక్కులు వచ్చిపడ్డాయట. ఓ ఫేమస్ డైరెక్టర్ కారణంగా ఆ ఇద్దరూ ఎటూ తేల్చుకోలేక పోతున్నారని టాక్ నడుస్తోంది. ఇంతకీ నందమూరి వారసులకు వచ్చిన ఆ సమస్య ఏంటి? దానికి పరిష్కారం ఏదైనా ఉందా? వివరాల్లోకి పోతే..

RRRలో ఎన్టీఆర్.. అన్నదమ్ములు డిస్టర్బ్
ఇటీవలే 'అరవింద సమేత' రూపంలో సక్సెస్ సాధించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఆయన.. ఈ సినిమా పూర్తికాగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 30వ సినిమా చేయనున్నారు. అయితే దీని కారణంగానే నందమూరి అన్నదమ్ములు డిస్టర్బ్ అయినట్లు తెలుస్తోంది.

సొంత నిర్మాణ సంస్థ.. భారీ హంగులతో సినిమాలు
సినిమాల విషయంలోనే గాక, మిగతా అన్నివిషయాల్లో ఈ బ్రదర్స్ ఒకరి పట్ల మరొకరు ఎంతో కేరింగ్‌గా ఉండటం చూస్తూనే ఉన్నాం. ఒకరి సినిమాకు మరొకరు ప్రోత్సాహం ఇవ్వడం, తమ్ముడు ఎన్టీఆర్ సినిమాలను కళ్యాణ్ రామ్ భారీ హంగులతో తన సొంత నిర్మాణ సంస్థపై నిర్మించడం జరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ 30వ సినిమాను నిర్మించాలనుకున్నారు కళ్యాణ్ రామ్.

ఇరకాటంలో నందమూరి బ్రదర్స్
ఇటీవలే ఎన్టీఆర్ 30వ చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉండనుందని తేలిపోయింది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘అయినను పోయి రావలే హస్తినకు' అనే టైటిల్ పరిశీలనలో పెట్టారు. ఈ ప్రాజెక్ట్ నందమూరి బ్రదర్స్‌ని ఇరకాటంలో పడేసింది వార్తలు ఊపందుకున్నాయి.

త్రివిక్రమ్‌తో ప్రాజెక్ట్.. లైన్ లోకి మరో నిర్మాణ సంస్థ
నిజానికి ఎన్టీఆర్ తన 30వ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మాణంలో చేయాల్సి ఉంది. వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన 'జై లవకుశ' సినిమా సమయంలోనే ఈ ఒప్పందం జరిగినట్లు సమాచారం. కానీ ఊహించని విధంగా త్రివిక్రమ్‌తో ప్రాజెక్ట్ సెట్ కావడం, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ లైన్‌లోకి దింపడం చకచకా జరిగిపోయాయి.


ఎన్టీఆర్ సలహా.. రెడీగా లేకపోవడంతో సమస్య
హారికా అండ్ హాసిని క్రియేషన్స్ త్రివిక్రమ్ ఆస్థాన సంస్థ. ఇటు ఎన్టీఆర్ ఆర్ట్స్ అన్నయ్య కళ్యాణ్ రామ్ సంస్థ. ఈ నేపథ్యంలో ఏం చేయాలని ఆలోచించిన ఎన్టీఆర్.. రెండు సంస్థలు కలిసి తన 30వ సినిమాను సంయుక్తంగా నిర్మించమని సలహా ఇచ్చారట. కానీ దీనికి ఈ నిర్మాణ సంస్థలు రెడీగా లేకపోవడంతో సమస్య ఏర్పడిందని తెలుస్తోంది. చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో!.