ఎన్టీఆర్ తర్వాతి సినిమా ఆ డైరెక్టర్‌తోనే! కన్ఫర్మ్ అయినట్లేనా..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి ప్రాజెక్టుతో బిజీ బిజీగా ఉన్నారు. RRR పేరుతో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. దీంతో ఎన్టీఆర్ తర్వాతి ప్రాజెక్టు విషయంలో ఇప్పటి నుంచే వార్తలు ఊపందుకున్నాయి. ఆ డైరెక్టర్‌తో.. ఈ డైరెక్టర్‌తో అంటూ తెగ వార్తలు పుట్టిస్తున్నారు గాసిప్ రాయుళ్లు.
అయితే వీటిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు త్రివిక్రమ్. గతంలో 'అరవింద సమేత' షూటింగ్ చేస్తున్న సమయం లోనే జూనియర్ ఎన్టీఆర్‌తో నెక్స్ట్ ఇయర్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని త్రివిక్రమ్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. అదే వచ్చే ఏడాది ఫిబ్రవరి తరువాత నిజం కానుందని అంటున్నారు. ఈ మేరకు బన్నీతో సినిమా చేస్తూనే ఎన్టీఆర్ కోసం కథ రెడీ చేసే పనిలో త్రివిక్రమ్ ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఈ విషయమై జోరుగా చర్చలు సాగుతున్నాయి.

నిజానికి ప్రస్తుతం చేస్తున్న అల్లు అర్జున్ సినిమా తర్వాత మహేష్ బాబు, వెంకటేష్, చిరంజీవి లలో ఎవరితోనైనా ఒకరితో త్రివిక్రమ్ మూవీ ఉంటుందని భావించారంతా. కానీ తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఎన్టీఆర్ తోనే కన్ఫర్మ్ అంటున్నారు. చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో! ఇకపోతే ప్రస్తుతం త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఈ సినిమాతో అటు త్రివిక్రమ్, ఇటు బన్నీ ఇద్దరూ సూపర్ డూపర్ హిట్ కొట్టేస్తారని ఫ్యాన్స్ అంచనాలు పెట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











