ఎన్టీఆర్ డేరింగ్ డిసీజన్.. సన్నిహితుడి సలహాతో రెడీ అయ్యాడు

వరుస సినిమాలతో మంచి జోష్‌‌లో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తాజాగా ఓ సినిమాలో గెస్ట్ రోల్‌ చేయడానికి కూడా సిద్ధమయ్యారట. డిఫెరెంట్ కథలు ఎంచుకుంటూ కేవలం నటనా ప్రతిభతో అంచెలంచెలుగా పైకొచ్చిన ఎన్టీఆర్ ఓ గెస్ట్ రోల్ కోసం సిద్ధం కావడమంటే ఆ రోల్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగేంద్ర అనే దర్శకుడు రూపొందిస్తున్న చిత్రంలో ఓ కీలకమైన పాత్ర కోసం ఎన్టీఆర్‌ని సంప్రదించగా ఆయన ఓకే చెప్పనట్లు సమాచారం. కేవలం 10 నిముషాలు మాత్రమే ఉండే ఈ రోల్‌లో నటించేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఈ కామియోకు సంభందించిన నేరేషన్ విన్న ఎన్టీఆర్.. ఫైనల్ గా ఓ సారి మొత్తం స్క్రిప్ట్ విని, అది తను మాత్రమే చేయగలిగే ప్రత్యేకమైన పాత్ర అయితే తప్పకుండా చేస్తానని మాట ఇచ్చారట. అయితే ఈ గెస్ట్ రోల్ లో చేయమని ఎన్టీఆర్‌కి సూచించింది ఆయన అత్యంత సన్నిహితుడైన మహేష్ కోనేరు అని తెలుస్తోంది.

N. T. Rama Rao Jr Ready To Play Guest Role In Mahesh S. Konerus Movie

వెండితెర హీరో దగ్గరి నుంచి బుల్లితెర హోస్ట్ వరకూ అన్నింటా ఆకట్టుకున్న ఎన్టీఆర్.. ఇప్పుడు గెస్ట్ రోల్‌పై ఇంట్రెస్ట్ చూపుతుండటం తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. హీరో ప్రాధాన్యమున్న సినిమాలో గెస్ట్ గా కనిపించటం కంటే.. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో గెస్ట్ రోల్ చేయడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుందని భావించిన ఎన్టీఆర్ ఇందుకు సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది.

సఖి అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను మహేష్ కోనేరు నిర్మిస్తున్నాడు. ఇప్ప‌టికే హైదరాబాద్‌లో కొంత భాగం షూటింగ్ ఫినిష్ చేసిన చిత్రయూనిట్..త్వ‌ర‌లోనే ఓ భారీ షెడ్యూల్ కోసం యూరప్ వెళ్ల‌నుందని సమాచారం. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్' మల్టీస్టారర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X