ఎన్టీఆర్ సరసన రష్మిక మందన్న.. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
టాలీవుడ్‌లో మరో బ్యూటిఫుల్ కాంబినేషన్‌లో సినిమా రాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న జోడీ కట్టనుందనే న్యూస్ వైరల్ అవుతోంది. వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటూ సూపర్ ఫామ్‌లో ఉన్న రష్మికను ఎన్టీఆర్ సరసన నటించేందుకు గాను ఫైనల్ చేశారని టాక్ నడుస్తోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమా రూపొందనుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న RRR మూవీ పూర్తికాగానే ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ జోడీగా రష్మిక మందన్న అయితే బాగుంటుందని భావిస్తున్న మేకర్స్ ఆమెతో సంప్రదింపులు చేసేందుకు రెడీ అవుతున్నట్లు ఇన్‌సైడ్ టాక్.

వరుస హిట్స్‌తో మాంచి జోష్‌లో ఉన్న రష్మిక మందన్న ఇటీవలే సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించారు. చిత్రంలో ఈ ఇద్దరి జోడీ బాగుందని అంటున్నారు ఆడియన్స్. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ నేటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్స్ రాబడుతుండటం విశేషం.
ఇకపోతే రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అటు ఎన్టీఆర్ RRR పూర్తి చేసేలోగా ఈ సినిమాలో రష్మిక షూటింగ్ పార్ట్ పూర్తికానుందట. ఇలా అన్నీ సెట్ అయితే ఎన్టీఆర్- రష్మిక జోడీని కూడా చూసేయొచ్చు మరి!.


Click it and Unblock the Notifications











