RRR షాకింగ్ అప్‌డేట్.. జక్కన్న ప్లాన్.. నందమూరి అభిమానులకు కిక్కే కిక్కు!
బాహుబలి సినిమా తర్వాత అదే రేంజ్ సినిమాకు శ్రీకారం చుట్టారు దర్శకధీరుడు రాజమౌళి. ఇద్దరు బడా హీరోలతో RRR మూవీ మొదలు పెట్టిన ఆయన.. అందుకు సంబంధించిన షూటింగ్ చకచకా కంప్లీట్ చేస్తున్నారు. చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వకపోయినా నిత్యం ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తోంది RRR. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్‌డేట్.. సినిమా పట్ల నందమూరి అభిమానుల్లో ఆతృతను పెంచేసింది. ఇంతకీ ఏంటా అప్‌డేట్? వివరాల్లోకి పోతే..

పిరియాడికల్ యాక్షన్ డ్రామా.. భారీ నిర్మాణం
డీవీవీ దానయ్య సమర్పణలో రూపొందుతోంది ఈ భారీ సినిమా RRR. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ మూవీలో ఆలియాభట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఎన్టీఆర్, రామ్ చరణ్ రోల్స్.. రాజమౌళి ఎఫెక్ట్
రాజమౌళి తనదైన మార్క్ చూపించేలా ఎన్టీఆర్, రామ్ చరణ్ రోల్స్ తీర్చిదిద్దారట. ఎన్టీఆర్.. కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు. షూటింగ్ దశలోనే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

RRR షాకింగ్ అప్‌డేట్..
కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. ఈ భారీ మూవీలో ఎన్టీఆర్ పాత్ర అబ్బురపరుస్తుందని, ఆయన మూడు పాత్రల్లో కనపడనున్నారని తెలుస్తోంది. అయితే ఆ లుక్స్ ఎలా ఉంటాయనేది మాత్రం తెలియాలంటే మాత్రం సినిమా విడుదల వరకు ఆగాల్సిందే అంటున్నారు.

నందమూరి అభిమానులకు కిక్కే కిక్కు.. జక్కన్న ప్లాన్
నందమూరి అభిమానులకు స్పెషల్ కిక్ ఇచ్చేలా జక్కన్న ప్లాన్ చేశారని సమాచారం. ఎన్టీఆర్ కోసం మూడు పాత్రలు రాసుకున్నారట. ఆయన కనిపించే మూడు పాత్రలు దేనికవే ప్రత్యేకంగా ఉండి సినిమాలో హైలైట్ సన్నివేశాలుగా నిలుస్తాయని టాక్. ఎన్టీఆర్ ఓ పులితో ఫైట్ చేసే సన్నివేశాన్ని షూట్ చేసిన జక్కన్న.. మరిన్ని భారీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది.
Recommended Video

RRR.. రాజమౌళి అధికారిక ప్రకటన
హాలీవుడ్‌కి దీటుగా సినిమాలు తెరకెక్కిస్తున్న జక్కన్న.. 'RRR' కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 80 శాతం మేర షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇటీవలే వాయిదా పడింది. సంక్రాంతి కానుకగా జనవరి 8న RRR విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు రాజమౌళి.


Click it and Unblock the Notifications











