ఎన్టీఆర్‌తో మరో ప్రయోగం.. అదే జరిగితే నందమూరి అభిమానులకు పండగే మరి!

ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ టాలెంటే వేరు. హీరోగా వెండితెరపై అలరించడమే కాదు.. హోస్ట్‌గా బుల్లితెరపై మాటలతో మాయ చేయడంలోనూ ఎన్టీఆర్ దిట్ట అని అందరికీ తెలిసిన విషయమే. ఇక ఆయన డాన్సుల గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. ఇవేగాక ఎన్టీఆర్‌లో మరో టాలెంట్ ఉంది. అదే టాలెంట్ ఉపయోగిస్తూ తాజాగా మరో ప్రయోగం చేయబోతున్నారట. ఇంతకీ ఏంటా టాలెంట్? ఏంటా ప్రయోగం? వివరాల్లోకి పోతే..

ఓ ఊపు ఊపేసిన ఎన్టీఆర్

ఓ ఊపు ఊపేసిన ఎన్టీఆర్

జూనియర్‌ ఎన్టీఆర్‌ మంచి నటుడే కాదు. టాలెంట్ ఉన్న సింగర్ కూడా అని ఇప్పటికే నిరూపించుకున్నారు. తన కంత్రి, అదుర్స్, నాన్నకు ప్రేమతో సినిమాల్లో పాటలు పాడి భేష్ అనిపించుకున్నారు. ముఖ్యంగా అదుర్స్ లో చారీ సాంగ్, నాన్నకు ప్రేమతోలో ఫాలో ఫాలో సాంగ్ ప్రేక్షకలోకాన్ని ఓ ఊపు ఊపేశాయి.

మాస్టర్‌ మూవీ.. తమిళ హీరో ప్రయత్నం

మాస్టర్‌ మూవీ.. తమిళ హీరో ప్రయత్నం

కాగా తాజాగా అందుతున్న సమాచారం మేరకు త్వరలో ఎన్టీఆర్ తో మరో పాట పాడించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. తమిళంలో విజయ్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘మాస్టర్‌'. ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల చిత్రంలోని ‘కుట్టి స్టోరీ' పాట విడుదల చేశారు. ‘లెట్‌ మి సింగ్‌ ఎ కుట్టీ స్టోరీ' అంటూ హీరో విజయ్‌ స్వయంగా పాడిన ఈ పాట ట్రెండింగ్‌లో ఉంది.

అక్కడ ఆయన.. ఇక్కడ ఈయన

అక్కడ ఆయన.. ఇక్కడ ఈయన

తెలుగులో ‘మాస్టర్‌' చిత్రాన్ని ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై మహేశ్‌ కోనేరు విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో ఎన్టీఆర్‌ చేత ‘కుట్టీ స్టోరీ' పాడించాలనుకుంటున్న ఆయన.. ఎన్టీఆర్‌ని కలిసి ఆ పాట పాడాలని విజ్ఞప్తి చేశారట. దీనికి ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే నందమూరి అభిమానులకు పండగే మరి!

Recommended Video

RRR First Look : The Best Fan Made Posters | RRR Poster Review | JR NTR | Ram Charan
ఎన్టీఆర్ RRR

ఎన్టీఆర్ RRR

ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం RRR ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే 70 షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X