నా నువ్వే వాయిదా.. ఆలస్యం ఎందుకంటే!
కళ్యాణ్ రామ్, తమన్నా జంటగా నటించిన నా నువ్వే చిత్ర విడుదల మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ నటించిన తొలి రొమాంటిక్ చిత్రం ఇది. 180 ఫేమ్ జయేంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. మే 25 నే ఈ చిత్రాన్ని విడుదుల చేయాలని ప్లేన్ చేశారు. కానీ జూన్ 1 కి వాయిదా పడింది. ఈ తేదీ కూడా వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి.
ట్రైలర్, టీజర్స్ లో తమన్నా, కళ్యాణ్ రామ్ మధ్య సాగె రొమాంటిక్ సన్నివేశాలు యువతని ఆకర్షించే విధంగా ఉన్నాయి. వీరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు తెలుస్తోంది. తమన్నా ఈ చిత్రంలో రేడియో జాకీ పాత్రలో నటిస్తోంది. దర్శకుడు జయేంద్ర ఈ చిత్రం ఎమోషనల్ ప్రేమకథగా తెరకెక్కించారు.

కాగా ఈ చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలు, గ్రాఫిక్స్ తదితర అంశాలు పూర్తి కాకపోవడంతో విడుదల మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ చిత్ర యూనిట్ కొత్త విడుదలతేదీని ప్రకటించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











